Bihar elections

Six maoist hit districts vote in second phase

Bihar Election 2015, Bihar Polls 2015, Second Phase Bihar Voting, Bihar 2nd Phase Vote, Voting in Bihar, Kaimur, Rohtas, Arwal, Jehanabad, Aurangabad, Gaya.

Voting has begun for the second phase of elections in Bihar. The fate of 456 candidates in 32 constituencies spread over six districts is up for the mandate. The districts are Kaimur, Rohtas, Arwal, Jehanabad, Aurangabad and Gaya.

బీహార్ లో రెండో విడత ఎన్నికలు ప్రారంభం

Posted: 10/16/2015 08:38 AM IST
Six maoist hit districts vote in second phase

బీహార్ లో ఈ ఉదయం 7గంటలకు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్ లో భాగంగా ఆరు జిల్లాల్లోని 32 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 86లక్షలమంది ఓటర్లు 456మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాగా, ఎన్నికలు జరుగనున్న కైమూర్, రోహ్‌తాస్, అర్వాల్, జెహనాబాద్, ఔరంగాబాద్, గయ జిల్లాలు నక్సల్స్ ప్రభావితమైనవి కావడంతో ఈ ఎన్నికలు పోలీసు, భద్రతాదళాలకు సవాల్‌గా మారాయి.

భద్రతా కారణాల నేపథ్యంలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ 7 గంటలకే ప్రారంభించి, 3గంటలకే ముగించాలని పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. 32 నియోజకవర్గాల్లో 9,119 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. భద్రతకు 993 కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను నియమించారు. మొదటి దశ ఎన్నికల్లో భాగంగా 49 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎలక్షన్ లో బిజెపి, ఎన్డీయే అలయెన్స్ కు మంచి ఓట్లు పడ్డట్లు అంచనా వేస్తున్నారు. నితీష్ కుమార్ కేబినెట్ లోని ఓ మంత్రి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడటంతో రెండో విడత ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని బిజెపి భావిస్తోంది. ఉదయం ఏడు గంట నుండి ప్రారంభమైన పోలింగ్ 11 నియోజక వర్గాల్లో 3 గంటలకు, 12 నియోజక వర్గాల్లో 4 గంటలకు ముగస్తుండగా.. మిగిలిన నియోజక వర్గాల్లో మామూలు టైంలోనే ముగుస్తుంది. మొత్తం 86, 13, 870 ఓట్లు ఉండగా 9, 119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమీషన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles