KCRs daughter Kavitha on Telangana Jagruthi Alligations

Kavitha on telangana jagruthi alligations

KCR, Kavitha, Farmers, Suicides, Telangana Jagruthi, Kavitha on farmers Suicide

KCRs daughter Kavitha on Telangana Jagruthi Alligations

కేసీఆర్ కూతురి తొమ్మిది రోజుల కథ

Posted: 10/14/2015 11:42 AM IST
Kavitha on telangana jagruthi alligations

కేసీఆర్ కూతురిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవితకు గుర్తింపు ఉంది. నిజామాబాద్ ఎంపీగా జాతీయ స్థాయిలో కూడా కవితకు మంచి గుర్తింపు ఉంది. అయితే తాజాగా కవిత మీద విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రైతులకు అండగా నిలవాలని.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది. అయితే రైతుల పేరుతో కవిత దందా మొదలుపెట్టిందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవిత కొత్తగా రైతుల పేరుతో దందాకు దిగుతున్నారని... ఆరోపించడంతో వివాదం రాజుకుంది. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి తరఫున చనిపోయిన వారి కుటుంబాల్లో కొన్ని కుటుంబాలకు ప్రతి నెల 4500 ఆర్థిక సహాయం చెయ్యాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ తన మీద వచ్చిన ఆరోపణల మీద కొత్తగా స్పందించారు కవిత.

తెలంగాణ జాగృతి రైతుల పేరుతో దందాకు దిగిందని.. వసూళ్లకు పాల్పడుతోందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అయితే బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను ఎలాంటి రాజకీయ విమర్శలు చెయ్యను అని కవిత వెల్లడించింది. మధుయాష్కీ చేసిన ఆరోపణల మీద మీ స్పందన ఏంటి..? అని మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కవిత ఇలా తొమ్మిది రోజులు ఖామోష్ అంటూ బదులిచ్చారు. అయినా ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్ కానీ. ఇలా పండగ పేరుతో కూడా బ్రేక్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. మరి చూడాలి.. పంగడ తర్వాత కవిత ఎలా స్పందిస్తుందో

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Kavitha  Farmers  Suicides  Telangana Jagruthi  Kavitha on farmers Suicide  

Other Articles