Congress Leader Madhu Yashki Goud Controversy Comments On MP Kavitha | Farmers Suicide Cases | Kavitha Help To Farmers

Mp kavitha collections danda on farmers name congress madhu yashki goud

mp kavitha, mp kavitha news, mp kavitha photos, mp kavitha photo shoot, mp kavitha latest updates, Madhu Yashki Goud news, Madhu Yashki Goud controversy, mp kavitha controversy, kalvakuntla kavitha controversies, farmers suicide, telangana farmers suicide

MP Kavitha Collections Danda On Farmers Name Congress Madhu Yashki Goud : Congress Leader Madhu Yashki Goud Controversy Comments On MP Kavitha. He Said She Is Doing Collection Danda In the Name Of Farmers.

రైతుల పేరిట కవిత డబ్బులను దోచేసుకుంటోందట!

Posted: 10/13/2015 11:01 AM IST
Mp kavitha collections danda on farmers name congress madhu yashki goud

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అప్పుల బాధలు తాళలేక, పంటలు చేతికి అందక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ కవిత ముందుకొచ్చి.. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే.. వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు సమర్పించాలని ఆమె కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను సురక్షితంగా బయటపడేసేందుకు ముందుకు రావాలని అన్నారు. రైతుల సహకారం కోసం ఈ విధంగా కవిత ప్రారంభించిన విరాళాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తప్పుపట్టారు. రైతుల పేరిట ఆమె వసూళ్ల దందా చేస్తోందని ఆయన ఆరోపించారు.

హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన మధుయాష్కీ.. తెలంగాణలోని కుటుంబాల్లో మహిళల పసుపుతాళ్లు తెగుతూ ఇబ్బందుల్లో ఉంటే, కవిత మాత్రం బతుకమ్మ ఆడుతూ ఊరూరా తిరుగుతోందని అన్నారు. పాలనలో భాగమైన కవిత రైతులను ఆదుకోకుండా, తన సంస్థ ద్వారా డబ్బులు సేకరించి రైతు కుటుంబాలకు పంచుతానని చెబుతోందని ఆయన విమర్శించారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకాదని కవిత పరోక్షంగా చెబుతోందా? అని ఆయన అడిగారు. అప్పుడు తెలంగాణ అమర వీరుల శవాలపై పేలాలు ఏరుకున్న కవిత, ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం మొత్తం వసూళ్లకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ 110 ఎకరాల జాగీరు ఏర్పాటు చేసుకుంటే, కవిత లాక్మే షోరూంలు పెట్టుకుందని, హరీష్ రావు ఆంధ్రావాళ్లతో కలిసి ద్విచక్రవాహన వ్యాపారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

READ ALSO: బతుకమ్మ టైం.. కవిత టైం.. మరి మిగతాటైంలో కవిత ఏం చేస్తుంది..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kavitha controversy  Madhu Yashki Goud  Farmers Suicide  

Other Articles