student kausalya committed suicide over teacher harassement in chennai

Chennai plus two student suicide note reveals teacher molestation on students

student committed suicide, harassement, gajendran, kausalya, teacher ramesh, zoology lecturer ramesh, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women, bible

chennai plus two student kausalya suicide note reveals teacher molestation on students, villagers protest aganst zoology lecturer ramesh by staging rasta roko

కీచకోపాధ్యాయుడి వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

Posted: 10/08/2015 10:18 PM IST
Chennai plus two student suicide note reveals teacher molestation on students

రేపటి ఉత్తమ పౌరులుగా నేటి బాలబాలికలను తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన విధులను నిర్వహించే గురువులు కీచకులై.. కామపిశాచులై విద్యార్థినుల అసువలును తీస్తున్నారు. తాజాగా తన వద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ కామాంధ గురువు. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక కౌసల్య అనే ప్లస్‌టూ విద్యార్థిని గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో రాస్తారోకో చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం దిండివనం సమీపం కట్టళై గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కట్టళ్లై గ్రామానికి చెందిన గజేంద్రన్ కుమార్తె కౌసల్య (17) దేవనూరులో ఉంటూ ప్లస్‌టూ చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా బాలికకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడగానే బిగ్గరగా రోదించి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఇరుగుపొరుగు వారు వచ్చి కౌసల్యను కాపాడే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు పాల్పడిన గదిలోకి వెళ్లిచూడగా తాను చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుడిని ఉద్దేశించి కౌసల్య రాసిన రెండు పేజీల సూసైడ్‌నోట్ దొరికింది.

జంతుశాస్త్రం బోధించే టీచర్ రమేష్ లైంగిక వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా. బైబిల్ సాక్షిగా నేను చెప్పింది నిజం' అంటూ ఆ లేఖలో బాలిక పేర్కొంది. 'ఆతను ఎంతమాత్రం మంచివాడు కాదు. నాతో తప్పుగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బైటకు ఎలా చెప్పాలో తెలియలేదు. నాతో మాత్రమే కాదు, ఇతర విద్యార్థినులతో కూడా నీచంగా వ్యవహరించేవాడు. వారందరినీ అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. నేను ప్రాణాలతో ఉండి చెబితే నమ్మేవారా' అనేది తెలియదు. 'రమేష్ పెడుతున్న లైంగిక వేధింపుల నుంచి చావుతోనే నాకు విముక్తి. అతడిని వదలొద్దు, కఠినంగా శిక్షించండి' అంటూ ఆ ఉత్తరంలో కౌసల్య తన ఆవేదనను వెళ్లబోసుకుంది. ఈ ఉత్తరాన్ని చదివిన గ్రామస్తులు కౌసల్య మృతదేహంతో గురువారం ఉదయం 10 గంటలకు చెయ్యూరు-మధురాంతకం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటనతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా సొంతూరుకు వెళ్లిపోగా పోలీసులు విచారణ చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student committed suicide  harassement  gajendran  kausalya  teacher ramesh  bible  

Other Articles