Former Wipro employee files 1.2 million-pound discrimination suit against company

Sexual harassment in wipro

Wipro, Briton, London, Wipro employee, sexual harrasment, Harrasment in Wipro

A former Wipro employee at the company's London office has alleged that she was subjected to severe sexual harassment by male colleagues in London and has filed a suit claiming 1.2 million pounds in damages, claiming that she was also subjected to gender discrimination, unequal pay and unfair dismissal.

విప్రో ఉద్యోగినిపై లైంగిక వేధింపులా...?

Posted: 10/07/2015 01:10 PM IST
Sexual harassment in wipro

దేశ సాఫ్ట్ వేర్ రంగంలో విప్రో ఎంతో పేరుగాంచింది. అయితే విప్రోల జాబ్ రావాలంటేనే చాలా మంది అదృష్టంగా బావిస్తారు. అక్కడ జాబ్ చేస్తున్నారు అంటే అదో స్పెషల్ స్టేటస్ ఇస్తారు. అయితే నిజానికి విప్రొలొ పరిస్థితి వేరేలా ఉందని తాజాగా ఓ ఉద్యోగిని అంటోంది. అక్కడ కూడా మహిళల మీద లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తోంది. తనను లైంగికంగా, మానసికంగా కూడా వేధించారని ఆ ఉద్యోగిని వేధించిన కారణంగా తనకు మిలియన్ పౌండ్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. దాంతో విప్రో కంపెనీలో ఇలాంటి బాగోతాలు జరుగుతున్నాయా అని చర్చ మొదలైంది.

బ్రిటన్ లోని విప్రో ఆఫీసులో తాను పనిచేస్తున్న సమయంలో తనను వేధించారని, ఇతర ఉద్యోగులతో సమానమైన వేతనాలు చెల్లించలేదని, అసభ్యంగా ప్రవర్తించారని శ్రేయా ఉకిల్ అనే మాజీ ఉద్యోగిని ఈ కేసు వేసింది. విప్రోలో స్త్రీ ద్వేష సంస్కృతి, శ్రమ దోపిడీ అధికమని వెల్లడించింది. అక్కడి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ పుంజాతో అఫైర్ పెట్టుకునేలా నన్ను బలవంతం చేశారుని అంది.  అక్కడ పనిచేసే మహిళలు నరకంలో ఉన్నట్టే. తన అధికారాన్ని వినియోగిస్తూ పుంజా నన్ను ఎంతో వేధించారని ఆమె అన్నారు. తనను అన్యాయంగా సంస్థ నుంచి తొలగించారని, తనతో సమానంగా పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 1.5 లక్షల పౌండ్లు వేతనం ఇస్తూ, తనకు 75 వేల పౌండ్ల వేతనమే ఇచ్చారని ఆరోపించారు. మరి దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wipro  Briton  London  Wipro employee  sexual harrasment  Harrasment in Wipro  

Other Articles