Villagers anger on media

Villagers anger on media

Media, Delhi, Journalists, Villagers, Dadri

In Delhi, A villagers anger on Media. Media journalists over action at village for their media coverage.

మీడియా మీద గ్రామస్తుల గుస్సా

Posted: 10/07/2015 12:49 PM IST
Villagers anger on media

మీడియా అంటే నిజాలను వెలికి తియ్యాలి... కనిపించే ఒక దృష్యాన్ని మాత్రమే తియ్యడం కాదు అన్ని కోణాల్లో వార్తలను అందించాలి మీడియా. కానీ మన దేశంలో మాత్రం మీడియా అంటే అతి అని అందరికి తెలుసు. అందుకే గతంలో కూడా మీడియా మీద రకరకాల కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ గ్రామస్తులు మాత్రం వద్దు బాబు వద్దు మీరు మా గ్రామానికి రాకుండా ప్రశాంతంగా ఉంటామంటున్నారు. అంతేనా కొంపదీసి మీరు మా గ్రామానికి వస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన దాద్రి గ్రామ ఘటన మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అక్కడ నిషేదిత జంతు మాంసాన్ని తిన్నారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని చంపేసిన ఘటన అందరికి తెలిసింది. అయితే అక్కడ మీడియా చేస్తున్న అతివల్ల అందరికి ఇబ్బంది కలుగుతోందని గ్రామస్తులు మండిపడుతోంది.

రెండు మూడు రోజుల క్రితం దాద్రీ గ్రామంలో పరిస్థితి మామూలుగా ఉండేది. కానీ అక్కడ మీడియా వాళ్లు ఎంటరైనప్పటి నుండి పరిస్థితి మారిపోయింది. అక్కడి గ్రామస్తులు మామూలుగా ఉన్నా సరే అదీ ఇదీ అంటూ మీడియా ఒకటే కవరేజ్. అయితే నిషేదిత మాంసాన్ని తిన్నందుకు అక్కడ ఉన్న కొంత మంది ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. అయితే దీని మీద కేవలం వన్ సైడ్ మీడియా వార్తలు రాస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రయారిటి ఇస్తున్నారని కానీ గ్రామంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందట. గ్రామంలో ఓ బిజెపి నాయకుడిని అరెస్టు చెయ్యడం.... చనిపోయిన వ్యక్తి గురించి పోలీసులు మరో వ్యక్తిని టార్చర్ పెట్టడంతో చనిపోయడని కానీ ఇలాంటి వాటిని మాత్రం మీడియాలో చూపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి అందుకే మీడియా వారిని అనుమతించడం లేదు. అయినా మీడియా అంటే అందరి పక్షం ఉండాలి కానీ ఇలా ఒక పక్షం అయితే ఎలా అని అంటున్నారు గ్రామస్తులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Media  Delhi  Journalists  Villagers  Dadri  

Other Articles