Lalu Prasad's younger son Tejaswi aged more than elder one

Lalu prasad sons stories in elections

Lalu prasad, Bihar, Lalu Prasad sons, RJD president, Tej Pratap Yadav, Mahua Assembly, Tejashwi Prasad Yadav

Some glaring facts have come out from the affidavits filed by the two sons of RJD president Lalu Prasad as the documents indicate that the younger son is aged one year more than his elder brother. As per the affidavit filed by the by elder son Tej Pratap Yadav while submitting his nomination from Mahua Assembly seat in Vaishali district, his age is shown as completing 25 years.

లాలూ ప్రసాద్ కొడుకుల పిట్ట కథలు

Posted: 10/06/2015 10:25 AM IST
Lalu prasad sons stories in elections

బీహార్ ఎన్నికల్లో సిత్రాలు చోటుచేసకుంటున్నాయి. అక్కడి రాజకీయాలు అంతకంతకు వేడిపుట్టిస్తున్నాయి. అయితే అందరిలోకి లాలూ ప్రసాద్ అనే పేరు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే లాలూ ప్రసాద్ మాట్లాడే మాటలు.. చేసే చేష్టలు ఇలా అన్ని ఎంతో కీలకం. అక్కడి ప్రజలు కూడా లాలూ చేసే యాక్టింగ్ కు బాగా అలవాటు పడ్డారు. అందుకే లాలూ ప్రసాద్ ఏం చేసినా చూసి నవ్వుకునే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ మీడియా కూడా అదే రీతిలో లాలూ ప్రతి కదలికను కవర్ చేస్తూ తమ టిఆర్పి రేటింగ్ పెంచుకుంటుంది. తాజాగా లాలూ ప్రసాద్ కొత్తగా తన కొడుకుల మీద పిట్ట కథలు చెబుతున్నారు. అవును చిన్న కొడుకు అలా.. పెద్ద కొడుకు ఇలా అంటూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అసలు లాలూ గారి కొడుకుల కథేంటో తెలుసుకోవాలంటే.. మొత్తం స్టోరీ చదవండి.

లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి.. పశువుల దాణా కుంభకోణంలో దేశంలో టాప్ కరెర్షన్ పర్సన్ గా పేరుగాంచారు. అయితే తాజాగా బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ తో కలిసి ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నాలు ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. లాలూ కొడుకులిద్దరూ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చకు తెరతీశాయి. పెద్ద కుమారుడు తేజ్ తన వయసును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే అతడి కంటే చిన్నోడైన తేజస్వీ మాత్రం తన వయసును 26 ఏళ్లుగా పేర్కొంటూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశం ఆధారంగా నామినేషన్లను తిరస్కరించే అవకాశం లేదని బీహార్ అదనపు ఎన్నికల అధికారి వెల్లడించారు. మొత్తానికి ప్రస్తుతానికి లాలూ నాటకాలు బాగా పండిపోయాయి. మరి ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయో మాత్రం ప్రజల చేతిలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles