Venkiah Naidu face bad time in France

Venkiah naidu face bad time

Venkaiah Naidu, France, Venkiah Naidu News, Central Minister Venkiah Naidu

Central Minister Venkiah Naidu face bad time in france. He posted his sad movement in France with twitter. He explains his night time journey in heavy rain

వెంకయ్య నాయుడు.. బ్యాడ్ టైం అంటే ఇదే

Posted: 10/06/2015 10:38 AM IST
Venkiah naidu face bad time

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కథలు అల్లడంలో నెంబర్ వన్. తన ప్రతి ప్రసంగంలో కూడా ఏదో ఒక కథ చెబుతుంటారు. మరి అలాంటి వెంకయ్య నాయుడుకు చుక్కలు కనిపిస్తే ఊరికే ఉంటారా..? ఊరికే ఎందుకుంటారు ఊరంతా చెప్పుకుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే వెంకయ్య నాయుడుకు ఎదురైంది. కష్టపడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ ఫ్లైట్ లో కాకుండా తన వెహికిల్ లో హోరు వర్షంలో రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. పాపం అర్థరాత్రి అని కూడా చూసుకోకుండా వెంకయ్య నాయుడుకు ఫ్రాన్స్ లో చుక్కలు చూపించారు అక్కడి ఎయిర్ పోర్ట్ అధికారులు. మొత్తం విషయాన్ని తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ తన అసహనాన్ని వెల్లగక్కారు వెంకయ్య నాయుడు.

ఫ్రాన్స్ లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఛేదు అనుభవం ఎదురైంది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడ బోర్డెక్ నగరంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన వెళ్లారు. అయితే ప్రాన్స్ విమానంలో ఆయన ఇందుకోసం అక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు. కాని ఎయిర్ ప్రాన్స్ అదికారులు చెప్పా పెట్టకుండా వెంకయ్య నాయుడు టిక్కెట్ ను రద్దు చేశారు.దాంతో ఆయన సుమారు ఆరువందల కిలోమీటర్ల దూరం వర్షంలో రోడ్డుపై ప్రయాణించవలసి వచ్చింది.ఈ విషయాన్ని వెంకయ్య నాయుడు ట్విటర్ లో తెలిపారు.దీనిపై వెంకయ్య నాయుడుకు ప్రాన్స్ మంత్రి క్షమాపణ చెప్పారు. ఎందుకు ఇలా జరిగిందో విచారణ జరిపిస్తామని కూడా ఆ దేశ మంత్రి ప్రకటించారు. ఏది ఏమైనా అంత దూరం రోడ్డు మార్గం ద్వారా వెళ్లి వెంకయ్య నాయుడు ఇబ్బంది పడవలసి వచ్చింది. అయినా టైం బ్యాడ్ ఐనప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలుగుతారు చెప్పండి పాపం అని అనుకోవడం తప్ప.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  France  Venkiah Naidu News  Central Minister Venkiah Naidu  

Other Articles