A Hyderabadi Boy Named Veeraswamy Cheated Flipkart For 200 Times And Stolen 20 Lakhs | Online Products | E-Commerce Sites

Hyderabadi boy veeraswamy cheated flipkart 200 times stolen 20 lakhs online products e commerce sites

flipkart cheating case, flipkart fraud, hyderabadi fraud flipkat, veeraswamy fruad flipkart, Flipkart Cheating, Online Products, E commerce sites, Veeraswamy Cheating Case

Hyderabadi Boy Veeraswamy Cheated Flipkar 200 Times stolen 20 lakhs Online Products E-Commerce Sites : A Hyderabadi Boy Named Veeraswamy Cheated Flipkart For 200 Times And Stolen 20 Lakhs. First He Ordered Costly Electronics Products And Returned Fake Objects. By This Method He Got 20 Lakhs.

‘Flipkart’ను 200 సార్లు మోసం చేసిన హైదరాబాదీ!

Posted: 10/05/2015 01:52 PM IST
Hyderabadi boy veeraswamy cheated flipkart 200 times stolen 20 lakhs online products e commerce sites

ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని ఎంతోమంది మంచి కార్యాల కోసం ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం వినూత్న మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొందరు మోసగాళ్లు ‘హ్యాకింగ్’ ద్వారా డబ్బులను దోచేస్తుంటే.. మరికొందరు కనీవినీ ఎరుగని రీతిలో మోసాలకు పాల్పడుతూ డబ్బులను దండుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటనను తీసుకోవచ్చు. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దిగ్గజంగా పేరుగాంచిన ‘ఫ్లిప్ కార్ట్’ను ఓ హైదరాబాదీ 200 సార్లు మోసగించి, సుమారు రూ.20 లక్షలు దోచేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.

‘ఫ్లిప్ కార్ట్’ సంస్థ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింతగా చూరగొనేలా 'ప్లెక్సిబుల్ రిటర్న్ పాలసీ'ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తువు నచ్చకపోయినా.. అందులో ఏదైనా లోపం గుర్తించినా.. దాన్ని నియమిత సమయంలోపు వెనక్కిచ్చేస్తే వెంటనే ఆ డబ్బు వాపస్ చేయబడుతుంది. పైగా.. ‘ఎందుకు, ఏమిటి’ అని ప్రశ్నించడం కూడా ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకున్న వీరాస్వామి అనే యువకుడు తనదైన రీతలో కొత్త ఆలోచన చేసి, మోసం చేయడం ప్రారంభించాడు. తన కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు వారి పేర్లతో పలు వస్తువులకు ఆర్డర్ ఇచ్చేవాడు. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవాడు. అవి ఇంటికి డెలివరి అయిన తర్వాత అవి నాసిరకంగా ఉన్నాయంటూ.. వాటి స్థానంలో నకిలీ ఉత్పత్తులను వెనక్కు పంపుతుండేవాడు. ఈ వస్తువులు ఫ్లిప్ కార్ట్ కు చేరగానే వీరాస్వామి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుండేది. ఈ తతంగం గత 20 నెలలుగా జరిగింది. దాదాపు 200కు పైగా ప్రొడక్టులను కొన్న వీరాస్వామి.. వాటిని వెనక్కు పంపడం ద్వారా రూ. 20 లక్షలు స్వాహా చేశాడు.

అయితే.. తరచూ ప్రోడక్టులు వెనక్కు వస్తుండటంతో ‘ఫ్లిప్ కార్ట్’ సంస్థకు అనుమానం వచ్చింది. దాంతో ఆ సంస్థ తనదైన రీతిలో విచారణ చేయగా.. ఆ యువకుడి మోసం బట్టబయలైంది. ఇతను మోసం చేసిన తీరు పోలీసులనే అబ్బుర పరిచింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటువంటి కేసు నమోదవడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart cheating case  Veeraswamy Fraud Flipkart  

Other Articles