suspension episode in Telangana assembly

Suspension episode in t assembly

Telangana, Assembly, KCR, janareddy, Uttam Kumar Reddy

Telangana assembly suspended some oposition party leaders in this session. Congress party leaders Janareddy, Uttamkumar Reddy and many others suspended from the house.

అసెంబ్లీలో సస్పెన్షన్ సీన్.. గందరగోళం

Posted: 10/05/2015 10:46 AM IST
Suspension episode in t assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసమయానికే గందగోళానికి తావుతీశాయి. సభలో తీర్మానాల మీద ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే సిఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల మీద తన అసహనాన్ని వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ ను కాదని.. రెండు రోజుల పాటు రైతుల ఆత్మహత్యల మీద చర్చకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని కానీ దాన్ని కాదని ప్రతిపక్ష నాయకులు మొండిగా వ్యవహారించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని అంశాల మీద చర్చకు సిద్దంగా ఉందని... ప్రభుత్వం తరఫున ఏం చెయ్యాలో.. ఏం చేస్తున్నామో కానీ ప్రభుత్వం స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం రైతుల ఆత్మహత్యల మీద వాయిదా తీర్మానానికి పట్టుబట్టాయి. దాంతో అసెంబ్లీలో అప్పుడే సస్పెన్షన్ పర్వానికి తెర లేచింది.

రైతుల ఆత్మహత్యల మీద ఇప్పటికే చాలా సార్లు దద్దరిల్లిన సభ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. మూడు రోజుల విరామం తర్వాత కూడా సభలో, సభ్యుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. గతంలో లాగా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల నాయకులకు ధీటుగా సమాధానం వినిపించినా.. ప్రతిపక్షనాయకులు మాత్రం ఎంతకీ తగ్గలేదు. చివరకు ప్రతిపక్ష నాయకులలో కొంత మంది సస్సెన్షన్ వేటు వేసింది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు జానారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను సభలో నుండి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయాల్సిందిగా హరీష్ రావు సభలో సిఫారసు చేశారు. జానారెడ్డి, రాంమోహన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సహా పలువురు ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెన్డ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Assembly  KCR  janareddy  Uttam Kumar Reddy  

Other Articles