100 Crores Caught In IT Raids | Film Industry People | Ilayathalapathy Vijay | Nayanatara | Samantha

It raids film industry people 100 crores caught

it raids, it raids on heroes, it raids on actresse house, samatha it raids, ilayathalapathy vijay it raids, nayanatara it raids

IT Raids Film Industry People 100 Crores Caught : 100 Crores Caught In IT Raids In Film Industry Related Stars And People.

సినీనటుల ఐటీ దాడుల్లో 100 కోట్లు వసూలు?

Posted: 10/03/2015 10:55 AM IST
It raids film industry people 100 crores caught

ఆదాయపన్ను అధికారులు ఇటీవల సినీ నటుల ఇళ్లలో హఠాత్తుగా ఐటీదాడులు నిర్వహించిన విషయం తెలిసిందే! ఆ తనిఖీల్లో ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల నుంచి ట్యాక్స్ కట్టడం లేదని ఐటీ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో ఏకంగా రూ.100 కోట్ల మేరకు లెక్కల్లోకి రాని విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయట. ఈ మేరకు రెండురోజులపాటు వరుస తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు సదరు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకన్నారని తెలుస్తోంది. ఇందులో రూ. 2 కోట్లు విలువగల నగలు, మరో 2 కోట్లు నగదు సైతం ఉన్నట్టుగా ఆదాయపన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మూడురోజుల క్రితం ఇళయదళపతి విజయ్, సంచనల నటి నయన తార, చెన్నై చిన్నది సమంతలతో పాటు నిర్మాతలు సెల్వకుమార్, సిబుతామీన్స్, కలైపులి థాను, మదురై అన్బు,  దర్శకులు శింబుదేవన్, అన్బుసెలియన్, విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్, పులి చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ వర్గాలు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. బుధ, గురు వారాల్లో 400 మంది అధికారులు 35 చోట్ల తనిఖీలు చేశారు. చెన్నై, హైదరాబాద్, మదురై, కోయంబత్తూరు, కొచ్చిన్, తిరువనంతపురం తదితర 35 చోట్ల పలు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌసుల్లో రెండు రోజులపాటు సాగిన ఈ తనిఖీల్లో వంద కోట్ల మేరకు లెక్కల్లోకి రాని  నగలు, నగదు, ఆస్తుల రికార్డులు, పత్రాలు బయట పడ్డట్టుగా సమాచారం.
 
అయితే, ఈ లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తుల వివరాలు ఎవరి ఇళ్లల్లో, ఎక్కడ లభించిందోనన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచే పనిలో ఆదాయపన్ను శాఖ వర్గాలు  ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్తులకు సంబంధించి సదు నటులు, సినీ ప్రముఖులు పన్ను చెల్లించారా? లేదా? అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 30 కోట్ల మేరకు పన్ను ఎగవేత దిశగా వ్యవహరించి ఉన్న పది మందికి  జరిమానా విధించేందుకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : it raids on actors  kollywood news  vijay  

Other Articles