That CM call worth four hundred crore rupees

That cm call worth four hundred crore rupees

Farmers, Suicide, Maharastra, Telangana, Ap, fund, Devendra fadnavis, Donations

That CM call worth four hundred crore rupees. In a country where income tax collections have historically been low is it possible that the people themselves would willingly loosen their purse strings? A whopping Rs. 400 crores - that's how much Chief Minister Devendra Fadnavis' office said people have willingly donated to the Maharashtra government's ambitious project Jalyukt Shivar Abhiyan to make the 25,000 villages in the state drought-free by 2019.

ఆ సిఎం పిలుపుకు 400 కోట్లు

Posted: 10/03/2015 10:29 AM IST
That cm call worth four hundred crore rupees

దేశంలో రైతుల ఆత్మహత్యల మీద పెద్ద చర్చే నడుస్తోంది. ఎటు చూసినా రైతుల ఆత్మహత్యల మీద రాద్దాంతం నడుసస్తోంది. అది దిల్లీ దగ్గరి నుండి మన తెలుగు రాష్ట్రాల వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. అయితే రైతుల ఆత్మహత్యలకు మీ ప్రభుత్వం కారణం అంటూ అధికార, ప్రతిపక్షాలు తన్నుకు చావడానికి అసెంబ్లీ సమావేశాల్లో టైం సరిపోవడం లేదు. అయితే ఓ రాష్ర్ట ముఖ్యమంత్రి గారి ఓ పిలుపు మాత్రం రైతులకు అండగా నిలుస్తోంది. వారికి అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అందరిచేత సహాయాన్ని పొందుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం ఆ సిఎంను చూసినై మారి.. ఇక్కడి రైతుల పరిస్థితిని మారిస్తే బాగుంటుంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు..? ఏ రాష్ట్రంలో అనే అనుమానాలకు కింది స్టోరీ క్లారిటీ ఇస్తుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద చలించిపోయారు. దాంతో తమ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో కొత్తగా ఓ పథకాన్ని రూపొందించారు. దాని ప్రకారం రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న కారణాలను తెలుసుకొని... వారికి అండగా నిలబుడుతుంది అక్కడి ప్రభుత్వం. జల్ యుక్త్ శివార్ అభయాన్ అనే పేరుతో కొత్త ఆశలు చిగురింపజేశారు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్. అలా ఏర్పాటు చేసిన నిధికి అందరూ తమకు తోచినంత సహాయం చేశారు. హీరో అక్షయ్ కుమార్ దగ్గరి నుండి క్రికెటర్లు, మోడల్స్ ఇలా అందరూ తమ వంతు సహాయాన్ని అందించారు. అందులో భాగంగా ఏకంగా 400 కోట్ల రూపాయలు పోగేశారు. కరువు పరిస్థితులను దాటేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరి సహాకారం ఎంతో కీలకంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల సిఎంలు కూడా ఇలా రైతుల కోసం ఏదో కొత్తగా వారి బతుకుల మీద ఆశలు చిగురించేలా చేస్తే బాగుంటుంది. మరి ఈ విషయం మన తెలుగు చంద్రులకు తెలుస్తుందో లేదో..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmers  Suicide  Maharastra  Telangana  Ap  fund  Devendra fadnavis  Donations  

Other Articles