Titanic's last luncheon menu fetched RS 8800000 at auction

Check out the picture of titanic s last luncheon menu

luncheon menu fetched RS 8800000 at auction, first-class passengers aboard, ill-fated Titanic, online auction, shipwreck, auction, history, einstein, aldrich ames, titanic lunch menu, titanic artifacts, titanic auction, lion heart autographs, titanic luncheon, titanic, titanic luncheon auction, grilled mutton chops, custard pudding, lifestyle

More than a century after first-class passengers aboard the ill-fated Titanic ate grilled mutton chops and custard pudding in an elaborate dining room, the ship's last luncheon menu had fetch RS. 88,00,000 in an online auction

టైటానిక్ చివరి మెనుకార్డుకు వేలంలో భలే రేటు..!

Posted: 10/02/2015 05:33 PM IST
Check out the picture of titanic s last luncheon menu

'టైటానిక్' లంచ్ మెనూ కార్డు అంచనాలను పైబడి రాబడిని సంపాదించింది. సుమారుగా శతాబ్ధం క్రితం టైటానిక్ అనే పెద్ద ఓడలో ప్రయాణానికి వెళ్లిన ప్రయాణికులు విశాలవంతమైన డైనింగ్ హాలులో వారి తినేందుకు పలు రకాలు వంటకాలు సిద్దం చేసింది. అయితే వాటినే తమ మెనులో పోందుపర్చింది. దానిని ఇప్పుడు ఆన్ లైన్ లో వేలం నిర్వహించారు. దానికి సుమారుగా డబై వేల డాలర్లు వస్తాయని అంచానాలు వుండేవి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ..  లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో దాదాపు రూ. 88 లక్షలు పలికింది. ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడం విశేషం.

టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన  అబ్రహం లింకన్ సాల్మన్ అనే వ్యక్తి దీన్ని భద్రపరిచాడని లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ తెలిపింది. నిపై 1912, ఏప్రిల్ 14 తేదీ స్టాంపుతోపాటు వైట్ స్టార్ లినె లోగో ఉంది. గ్రిల్లెడ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, కార్నెడ్ బీఫ్, బ్యాకెడ్ జాకెట్ పొటాటోస్, బఫెట్ ఆఫ్ ఫిష్, హామ్ అండ్ బీఫ్, యాపిల్ పెస్ట్రీతో పాటు 8 రకాల చీజ్ ఐటెమ్స్ వివరాలు మెనూలో ఉన్నాయి. 3 లేదా 4 టైటానిక్ మెనూ కార్డులు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం నుంచి బయట పడిన వారు వీటిని భద్రపరిచారు. ట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయింది. 1912, ఏప్రిల్ 15న జరిగిన ఈ దుర్ఘటనలో 1500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : titanic  luncheon menu  online auction  grilled mutton chops  custard pudding  

Other Articles