chain snatchers attack women at meerpet in hyderabad

Chain snatchers gang arrested in hyderabad

Chain snatchers gangs arrested, hyderabad city chain snatchets, 1 kg gold recovered from chain snacthes, two gangs, arested, meerpet, kukatpally,chain snatchers attacks on lone woman, woman gold ornaments, assembly monsoon session, police busy at assembly, inter state dacoits, old criminals, easy money

Two chain snacthing gangs in police custody, police recoverd 1 kg gold from accused, Even then on Friday chain snatchers attacked a women at meerpet

నగరంపై తెగబడిన చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు.. అయినా అగని స్నాచింగ్ లు

Posted: 10/02/2015 03:29 PM IST
Chain snatchers gang arrested in hyderabad

హైదరాబాద్ మహానగరంతో పాటుగా శివారు ప్రాంతాల మహిళల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న చైన్ స్నాచర్లు ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని వారి మెడలోని బంగారు అభరణాలను తెంచుకెళ్లే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మరికోద్ది సేపట్లో మీడియా ముందు హాజరుపర్చనున్నారు. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవాళ రెండు స్నాచింగ్ గ్యాంగ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లలో సభ్యులుగా వున్న ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, వారు సుమారు 30 స్నాచింగ్ కేసులలో నిందితులని తెలిసినట్లు సమాచారం. నిందితుల నుంచి కేజీ బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలావుండగా, వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పిన రోజునే నగరంలో మరో రెండు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కూకట్ పల్లి ప్రాంతంలోని ఓ మహిళను టార్గెట్ చేసిన దుండగులు అమె మెడలోని బంగారు ఆభరణాలను, మంగళసూత్రాన్ని తెంచుకెళ్లారు. మరో ఘటనలో మీర్ పేట్ ప్రాంతంలో ఓ వృద్దురాలిని అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించి అమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. అయితే పోలీసులు మరింత విస్తృతంగా తనిఖీలు ఏర్పాటు చేసి, నిఘా విభాగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain snatchers  two gangs  arested  meerpet  kukatpally  hyderabad city  

Other Articles