unidentified man trying to sell khairatabad ganesh laddu

Khairatabad ganesh laddu sold for money in hayathnagar

khairatabad ganesh laddu sold for money in hayathnagar, khairatabad ganesh laddu sent back to tapeshwaram, lathi charge during khairathabad ganesh laddu, khairatabad ganesh, laddu prasadam, looty, tapeshwaram

khairatabad ganesh laddu, which was sent back to tapeshwaram as public gathering took place at the time of distribution was sold for money in hayathnagar

వినాయకుడి లడ్డూ పంఫిణీలో విఘ్నం.. సోమ్ము చేసుకున్న లూటీదారులు

Posted: 10/02/2015 02:15 PM IST
Khairatabad ganesh laddu sold for money in hayathnagar

విఘ్నాధిపతి వినాయకుడి లడ్డూ పంఫీణీలోనే విఘ్నాలు ఎదురయ్యాయి. అంతేకాదు.. లంబోదరుడి లడ్డూను కూడా విక్రయించి సోమ్ము చేసుకునే స్థాయికి దిగారు పలువురు లూటీదారులు. దశాబ్ధాల కాలం నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాతలను అందుకుంటున్న ఖైరతాబాద్ ఈ సారి కూడా ఘనంగా పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్య కైంకర్యాలతో పూజలను నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేసారు. అయితే అప్పటికే రాత్రి అయిన నేపథ్యంలో ఓకానోక సెలవు రోజున ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఎప్పటిమాదిరిగానే ఈ సారి కూడా లంబోదరుడి లడ్డూను పంచేందుకు ఏర్పాట్లు చేయగా, అనుకున్న సంఖ్యకు అనేక రెట్ల అధిక స్థాయిలో వచ్చిన భక్తులతో నిర్వహకులు లడ్డూ పంపిణీ కష్టంగా మారింది.

భారీగా తరలివచ్చిన భక్తులు ప్రసాదం కోసం ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పనిచెప్పాడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. దీంతో నిర్వాహకులు చేసేదీ లేక లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తయారీదారులకే దానిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించి... భారీ లడ్డూను లారీలో తాపేశ్వరంకు పంపారు. లడ్డూ ఉన్న లారీని హయత్ నగర్ లో ఆపేసి దోపిడీదారులు తమకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. దేవుడి ప్రసాదాన్ని డబ్బులకు విక్రయిస్తూ సరికొత్త దోపిడీకి తెరలేపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khairatabad ganesh  laddu prasadam  looty  tapeshwaram  

Other Articles