CM KCR Plans To Make Telangana Signature Towers With 150 Floors Which Will Become Highest Building In India | Telangana Development

Cm kcr plans to make telangana signature towers with 150 floors

cm kcr, kcr latest news, kcr plans, kcr singature towers, telangana signature towers, telangana signature towers plan, telangana towers plan, telangana development, telangana ministers meeting

CM KCR Plans To Make Telangana Signature Towers With 150 Floors : CM KCR Plans To Make Telangana Signature Towers With 150 Floors Which Will Become Highest Building In India.

సాగర తీరంలో ఆకాశమే హద్దుగా అతిపెద్ద టవర్!

Posted: 10/02/2015 10:26 AM IST
Cm kcr plans to make telangana signature towers with 150 floors

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుతమైన భారీ నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే ఆరులేన్ల కారిడార్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. షాంఘై టవర్స్, బుర్జ్ ఖలీఫా వంటి అత్యంత ఎత్తైన భవంతులతో పోలిన భారీ నిర్మాణం రాష్ట్రంలోని హుస్సేస్ సాగర్ తీరంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘తెలంగాణ సిగ్నేచర్’ పేరిట 150 అంతస్తులతో దేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉండాలని, అందుకే ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఇక ఆరు వరుసలతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కూడా రూపకల్పన జరుగుతోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట ఎయిర్‌బేస్ వరకు 11 కి.మీ. మేర సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ ఆకాశమార్గాన్ని నిర్మించనున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ భవంతుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘దుబాయ్‌లో ‘బుర్జ్ ఖలీఫా’.. షాంఘైలో ‘షాంఘై టవర్స్’.. కౌలాలంపూర్‌లో ‘కౌలాలంపూర్ టవర్స్’.. సింగపూర్‌లో ‘రిపబ్లిక్ ప్లాజా’.. న్యూయార్క్‌లో ‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’... వీటి తరహాలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ సిగ్నేచర్ టవర్స్ నిర్మిద్దాం’ అని కేసీఆర్ తన మదిలోని ఆలోచనను వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ తీరంలో లుంబిని పార్క్, బోట్స్ క్లబ్, టూరిజం ఆఫీస్ ఉన్న ప్రాంతంలో 'వాటర్ ఫ్రంట్ వ్యూ' ఉండేలా ఈ టవర్స్‌ను నిర్మించేందుకు ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా దీన్ని నిర్మించాలని, భారతదేశానికి ఒక బహుమానంగా అందించాలని సంకల్పించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా డిజైన్ రూపొందించి, నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఆయన గురువారం మూడు గంటలపాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. వినూత్నంగా తన కార్యాలయంలోని అటెండర్ ఎల్లయ్య మొదలుకుని సీఎస్ రాజీవ్‌శర్మ వరకు ఉద్యోగులందరినీ పేరుపేరునా పిలిచి, అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

'సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం.. ప్రపంచ చరిత్రలో తెలంగాణ అదే స్ఫూర్తికి ప్రతీకగా నిలబడాలి. అందుకే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఇక్కడో ప్రతిష్టాత్మక కట్టడం నిర్మించాలి. దేశంలోనే అత్యంత ఎత్తుతో తెలంగాణ టవర్స్ నిర్మిద్దాం. ప్రస్తుతం దేశంలో ముంబైలోని ఇంపీరియల్ జంట టవర్స్ దేశంలో ఎత్తయినవిగా పేరొందాయి. అక్కడే 116 అంతస్తులతో మూడో టవర్ నిర్మాణంలో ఉంది. అంతకు మించిన ఎత్తుతో రాష్ట్రంలో నిర్మించాలనే ఆలోచన ఉంది. దానికేం పేరు పెడదాం.. ఎలా చేద్దాం.. మీరెమంటారు..' అని సీఎం అందరినీ అడిగి.. వారు చెప్పిన అంశాలను సావధానంగా విన్నారు. గతంలోనే హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోర్టు తీర్పుల చిక్కుముడి కారణంగా ఆ కార్యాచరణకు అడ్డుకట్ట పడింది. దీంతో ఆ సమస్యలను న్యాయపరంగా తొలగించి.. ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులతో పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana signature  kcr plans highest building  telangana development  

Other Articles