Afghan Talibans Blast America c 130 Plane | Talibans Controversy | America Planes Controversy

Talibans blast america c 130 plane

talibans crime news, american Plane blast, american c 130 plan blast, american Plane blast in afghan, american Plane crashed in afghan, talibans crime news, talibans updates, talibans latest news

Talibans Blast America c 130 Plane : An American C-130 transport plane has crashed in Afghanistan, killing at least 11 people.

అమెరికా విమానాన్ని ధ్వంసం చేసిన తాలిబన్లు

Posted: 10/02/2015 10:19 AM IST
Talibans blast america c 130 plane

అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించిన ఓ విమానాన్ని తాలిబన్లు కూల్చేశారు. తమ బార్డర్ లో వచ్చిన ఆ విమానంపై అనుమానం రావడంతో వారు దాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఆ విమానం కుప్పకూలింది. దీంతో ఆ విమానంలో వున్న 12 మంది మరణించారు. సి-130 రకానికి చెందిన అమెరికన్ విమానం.. అర్థరాత్రి సమయంలో కూలిపోయిందని, దాంతో అందులో వున్నవాళ్లంతా మరణించారని సిన్హువా వార్తా తెలిపింది. ఈ ఘటన వెనుక బలమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది, విమానం ఎందుకు కూలిందన్న విషయాలు మాత్రం తెలియరావడం లేదు. ఈ ఘటన గురించిన వివరాలేవీ అందడం లేదని టోనీ విక్మన్ అనే ప్రతినిధి చెప్పారు. మరోవైపు.. ఆ  విమానాన్ని కూల్చింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నట్లు తాజా సమాచారం. గత సంవత్సరం జూన్ నెలలో సి-130 విమానం ఒకటి అఫ్ఘాన్ పశ్చిమప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. అయితే, అప్పట్లో ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ప్రస్తుతం జరిగిని సంఘటనను చూస్తుంటే.. అమెరికాను తాలిబన్లు మరోసారి టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వున్నాయని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : american c 130 Plane crashed  talibans blast american Plane  

Other Articles