A girlfiend Planned To Killed Her Boyfriend Rizwan Khan In Mumbai | Mumbai Crime News | Lovers Fight

Girlfriend calls boyfriend five men stabbed him to death rizwan khan

rizwan khan updates, rizwan khan murder, mumbai murder cases, girlfriend killed rizwan khan, girlfriend plan kill boyfriend, mumbai girl plan kill boyfriend, rizwan khan killed by girlfriend

Girlfriend Calls Boyfriend Five Men Stabbed Him to Death Rizwan Khan : A 21-year-old girl allegedly planned and had her 22-year-old boyfriend murdered at the popular Carter Road promenade in Bandra on Monday night.

ప్రియురాలు పిలిస్తే పోయాడు.. శవమై కనిపించాడు..

Posted: 09/30/2015 04:15 PM IST
Girlfriend calls boyfriend five men stabbed him to death rizwan khan

వారిద్దరు ప్రేమికులు.. కొన్నాళ్లు వారి ప్రేమాయణం సాఫీగానే సాగింది.. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి ఫోన్ చేసి ఓ స్థలానికి రావాల్సిందిగా పిలిచింది.. ఆ సమయంలో వెళ్లొద్దని స్నేహితులు వారించినా అతను వినకుండా వెళ్లాడు.. అంతే! శవమై కనిపించాడు. పథకం ప్రకారం చంపిన ఆ యువకుడ్ని హత్య చేసిన ఈ ఘటన ముంబై బాంద్రలోని ఫేమస్ కార్టర్ రోడ్ వద్ద జరిగింది.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి మిత్రుడు సైఫ్ మిర్జా చెప్పిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల రిజ్వాన్ కు 21 సంవత్సరాల ప్రియురాలు వుంది. గతకొంతకాలంగా వీరి ప్రేమవ్యవహారం సవ్యంగానే కొనసాగింది. అయితే.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ అమ్మాయి రిజ్వాన్ కు ఫోన్ చేసి.. క్వార్టర్ రోడ్ కు రమ్మని చెప్పింది. అప్పుడు రిజ్వాన్ తన మిత్రులతో ఖార్ ప్రాంతంలో ఓ పబ్ లో వున్నాడు. ఆ అమ్మాయిని కలవడానికి వెళుతున్నానని రిజ్వాన్ తన మిత్రులతో చెప్పగా.. ఆ సమయంలో వెళ్లవద్దని ఎంత చెప్పినా అతడు వినలేదు. దీంతో రిజ్వాన్ తో పాటు మిత్రులు కూడా కార్టర్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ రిజ్వాన్, తన గాళ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నారు. కొద్ది సేపటి తర్వాత వారిద్దరి వాదించుకోవడం మొదలు పెట్టారు. వాదన జరగుతున్న సమయంలో కొంతమంది వారికి సమీపంలో నిలబడి ఉండటాన్ని రిజ్వాన్ మిత్రులు గమనించారు. అయితే.. వాళ్ల గురించి అంతగా పట్టించుకోలేదు.

అటు రిజ్వాన్, అతని ప్రియురాలు వాదించుకుంటూ.. చిన్నగా కాస్త దూరంగా నడుస్తూ వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న రిజ్వాన్ మిత్రులకు మొదట్లో ఎటువంటి సందేహాం రాలేదు. కానీ.. ఎంతసేపటికి రిజ్వాన్ కనపడకపోవడంతో అతని మిత్రులు పరిగెత్తుకుంటూ వెళ్లి వెతికారు. రక్తపుమడుగులో స్పృహ తప్పి పడి ఉన్న రిజ్వాన్ ఖాన్ మృతదేహాన్ని వారు గుర్తించారు. అదే సమయంలో బైక్ లపై అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధపడుతున్న ఐదుగురు వ్యక్తులను చూశారు. రిజ్వాన్ ను సమీపంలో ఉన్న శాంతాక్రజ్ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తం పోవడంతో అతను మృతి చెందాడని అక్కడి వైద్యులు చెప్పినట్లు పోలీసులు, రిజ్వాన్ మిత్రులు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ హత్య పై రిజ్వాన్ బంధువులు మాట్లాడుతూ ఈ దారుణానికి పాల్పడింది ముమ్మాటికీ ఆ అమ్మాయేనని ఆరోపించారు. ఆ అమ్మాయిని రక్షించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఖార్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి దత్తాత్రేయ బార్గ్ డే మాట్లాడుతూ, ఈ హత్య కేసులో ఆ అమ్మాయి ఉందని తాము అనుమానిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి అందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles