ABN RK reveals KCR strategy in avoiding Gaddar| Telangana movement

Abn rk reveals kcr strategy in avoiding gaddar

kcr, abn, radha krishna, kcr deeksha, nims, secret, ahmad patel, sonia gandhi, chidambaram, ABN RK KCR, ABN RK Telangana movement, ABN RK comments on KCR, KCR strategy in avoiding Gaddar, telangana, shocking, telangana state, state bifurcation announcement, union government, comments, hot, pic, latest, breaking, ap politics, ts politics, telangana politics, latest news, seperate state, manmohan singh, gaddar, indefinite hunger protest

ABN Radhakrishna reveals about the strategy, Telangana Chief Minister KCR played, in case of Gaddar, during the Telanagana movement.

అయన కోసం అంత చేస్తే.. అంటూ కేసీఆర్ గుట్టు విప్పిన రాధాకృష్ణ

Posted: 09/29/2015 05:21 PM IST
Abn rk reveals kcr strategy in avoiding gaddar

తెలంగాణ రాష్ట్ర ప్రసత్త ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు పేరు చెప్పగానే తెలంగాణ ఉద్యమం కోసం సాగిన మలిదశ పోరు గుర్తుకువస్తుంది. శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమం పసివాళ్ల నుంచి పండు ముసలివాళ్ల వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. అంతకుముందు జరిగిన ఉద్యమంలో పోలీసుల తూటాలకు అసువులు బాసి.. అమరవీరులుగా తెలంగాణ ప్రజల మనస్సుల్లో నిలిచిన తొలితరం ఉద్యమానికి భిన్నంగా మలిదశ ఉద్యమం సాగింది. తమ రాష్ట్రం తమకు ఇవ్వాలని, స్వయం పాలన, ఆత్మగౌరవం, నీరు, ఉద్యోగ, ఉపాధి వనరులు తమ యువతకే కేటాయించాలంటూ సాగింది.

దీనికి ఆజ్యం పోసింది మాత్రం కేసీఆర్ అమరణ నిరాహరదీక్షే.. ఈ నిరాహార దీక్షతోనే అప్పటి సోనియా ప్రభుత్వం కదిలింది. తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ 2009లో డిసెంబర్ 9న అర్థరాత్రి ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటన నుంచి కొద్దిగా వెనక్కు తగ్గినా.. ఉద్యమం ఉధృతం కావడంతో చివరకు తెలంగాణ రాష్టాన్ని ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చివరకు జూన్ రెండు నుంచి తెలుగురాష్ట్రాలను అధికారికంగా విడదీసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడీ గొడవంతా ఎందుకంటారా.. ? కేసీఆర్ నిరాహారదీక్ష విరమణ వెనుకనున్న సీక్రెట్ ను రివీల్ చేస్తానంటూ ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రాధాకృష్ణా.. ఏకంగా తాజా ఆర్టికల్ లో ఆ గుట్టు విప్పారు.

దీక్ష సమయంలో కేసీఆర్ ను ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించిన తర్వాత దీక్ష చాలారోజులు సాగింది. దీక్షతో క్షీణించించిన కేసీఆర్.. ఇక తాను దీక్షను కోనసాగిస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరించిన నేపథ్యంలో దీక్ష విరమించాలని అనుకున్నారట. అమరణ దీక్ష చేపట్టిన మూడవరోజునే తాను దీక్ష విరమిస్తున్నానని చెప్పడంతో ఓయూ విద్యార్థులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శవయాత్ర కూడా నిర్వహించారు. దీంతో మళ్లీ అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే.. బాగోదని భావించిన కేసీఆర్.. దీక్ష విరమణకు ఓ సరైన కారణం వెతికారట. అందుకు ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకుడు రాధాకృష్ణ సాయం తీసుకున్నారట.

గద్దర్‌ తో ఒక ప్రకటన చేయిస్తే తాను దీక్ష విరమిస్తానని అప్పుడు రాధాకృష్ణను కేసీఆర్ కోరారట. కేసీఆర్ కోరిక మేరకు గద్దర్ ను రాధాకృష్ణ ఒప్పించారట. అనుకున్నదాని ప్రకారం డిసెంబర్‌ 9వ తేదీ ఉదయం గద్దర్‌ ప్రభృతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీక్ష విరమించవలసిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయారు. కాగా కేసీఆర్‌ వైపునుంచి స్పందన రాకపోవడంతో వారు విస్మయం వ్యక్తం చేశారట. అయితే ఇలా ఎందుకు చేశారని వాళ్లు అలోచించేలోపు అసలు విషయం వారికి తెలిసింది. అదేంటంటే.. అప్పటికే.. కాంగ్రెస్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ నుంచి కేసీఆర్‌కు ఫోన్‌ వచ్చిందని, . తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ఈ రోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తోందని చెప్పారట. దాంతో ఇక కేసీఆర్ దీక్ష విరమించకుండా ఉండిపోయారు. అదే రోజున రాత్రి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ఈ విషయమై ప్రకటన చేయడంతో ఆయన దీక్షను విరమించారు. లేకపోతే గద్దర్ చేతుల మీదుగా పళ్లరసాన్ని తీసుకుని కేసీఆర్ నిరాహారదీక్ష విరమించేవారని.. ఇదే అసలు రహస్యమని అసలు గుట్టును విపారు రాధాకృష్ణ.

అయితే ఈ ప్రస్తావన ఇప్పడెందుకు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అప్పుడే విప్పివుంటూ ప్రయోజనాలు వుండేవేమోకాని, ఇప్పుడు అదీ తెలంగాణ రాష్ట్రం సాకనమై.. సుమారు పదహారు మాసాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిసాలన సాగిస్తున్న క్రమంలో ఈ విషయాలు అంతగా ప్రభావం చూపవని తెలిసినా.. తన ఏబిఎన్ ఛానెల్ ను తెలంగాణలో నిషేధించి ఇప్పటికే ఏడాది మించిపోయిన క్రమంలో ప్రభుత్వంపై ఆయన ఆలా అక్కస్సు తీర్చుకుంటున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇక మరికోందరైతే ‘అప్పడు ఆయన కోసం అంత చేసినా.. ఇప్పుడాయన నన్నే టార్గెట్ చేసి.. ఏబిఎన్ ఛానెల్ పై నిషేదం విదిస్తారా అని’ అన్న ప్రతీకారేచ్చ కూడా రాధాకృష్ణలో కలిగివుండవచ్చునంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kcr  Radha krishna  amaran deeksha  congress  gaddar  government  

Other Articles