Steve Jobs Went to India for Inspiration, Apple's Tim Cook tells PM

Steve jobs went to india for inspiration apple ceo tells pm modi

PM Modi in US,Pm Modi meets Tim Cook,PM at Apple headquarters,PM in San Jose,PM at Apple office in San Jose, narendra modi, PM modi, america tour, silicon valley, steve jobs

Prime Minister Narendra Modi began his one-on-one engagement with tech-giants of Silicon Valley with a brief meeting with Apple Chief Tim Cook in San Jose, California.

స్టీవ్ జాబ్స్ తరచూ భారత పర్యటన అందుకోసమే..!

Posted: 09/27/2015 09:37 AM IST
Steve jobs went to india for inspiration apple ceo tells pm modi

ఇండియా కేవలం ఒక విపణే కాదు ప్రపంచానికి ఉద్దీపనం కూడా. అందుకే అక్కడి నుంచి స్ఫూర్తి పొందేందుకు యాపిల్ కంపెనీ దివంగత సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తరచూ ఇండియాకు వచ్చేవారని ప్రస్తుత యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రముఖ టెక్ దిగ్గజాల భేటీకి టిమ్ కూడా హాజరయ్యారు. ఒక్కొక్కరితో దాదాపు 15 నిమిషాలపాటు విడివిడిగా సాగిన సమావేశంలో ఈ మేరకు టిమ్ తన మనోభావాలను మోదీతో పంచుకున్నారు.

మోదీతో భేటీ బ్రహ్మాండంగా సాగింది' అని సమావేశం అనంతరం టిమ్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, క్వాల్కమ్ ప్రతినిధి పాల్ జాకబ్, సిస్కో సీఈవో జాన్ చాంబర్స్, అడోబ్ సీఈవో శాంతను నారాయెణ్, టైస్ వెంక్ శుక్లాలు కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్ ను నూతన ఆవిష్కరణలకు వేదికగా మలిచే ప్రక్రియలో నరేంద్ర మోదీ అతివేగంగా దూసుకుపోతున్నారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. 'గతేడాది నేను ఇండియాలోనే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ కచ్చితంగా మార్పు జరిగింది. భారత్ లో లాగే సిలికాన్ వ్యాలీలోనూ ఏదో సాధించాలని తపన పడే ఔత్సాహికులను కలిశా' అని పిచాయ్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  PM modi  america tour  silicon valley  steve jobs  

Other Articles