Jammu and Kashmir to Celebrate Without Internet

Ban on internet

Ban, Internet, Police, Ban on Internet, Jammu Kashmir, Eid, Bakrid

The Jammu and Kashmir government has ordered termination of data services from Friday morning up till Saturday night, as it apprehends misuse by anti-social elements to create communal tension. The directive by police to all service providers, on the eve of Eid, comes amidst the controversy over beef ban.

నేడు, రేపు ఇంటర్నెట్ బంద్

Posted: 09/25/2015 12:47 PM IST
Ban on internet

అవును మీకు చదువుతున్నది.. నిజమే. నేడు,చ రేపు రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిచిపోనుంది. అది కూడా మన భారతదేశంలోనే. ఉగ్రవాదుల కార్యకలాపాలు ఇంటర్నెట్ సహాయంతో మరింత రెచ్చిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. గతంలో పర్సనల్ మెసేజ్ లపై నిఘా ఉంచాలని.. దాదాపు 40 రోజుల పాటు ఎవరూ కూడా తమ ఇన్ బాక్స్ లోని మెసేజ్ లను డిలీట్ చెయ్యడానికి వీలులేదని కేంద్రం మొండి చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అయితే దేశవ్యాప్తంగా దానిపై నిరసనలు రావడంతో.. వెనక్కు తగ్గింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం ఓ రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివెయ్యడం వార్తల్లో నిలుస్తోంది.

భారతదేశంలోని అతి కల్లోలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లో తాజాగా ఇంటర్నెట్ పై నిషేదం విధించారు. అక్కడ నేడు, రేపు ఇంటర్నెట్ సర్వీసులను నిలుపుచేస్తూ అక్కడి సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు అందాయి. అయితే బక్రీద్ సందర్భంగా కొంత మంది గోమాంసం నిషేదం మీద రెచ్చగొట్టే ప్రచారం చేయబోతున్నట్లు ముందుగా సమాచారం అందడంతో నిఘా వర్గాలు నెట్ సర్వీసులను నిలిపివేస్తే మంచిదని సూచించింది. గత కొంత కాలంగా జమ్ము కాశ్మీర్ లో నిప్పురాజుకుంటోంది. అక్కడి అసాంఘిక శక్తులు స్థానిక యువతను రెచ్చగొట్టి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు పోలీసులు ప్రకటించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ban  Internet  Police  Ban on Internet  Jammu Kashmir  Eid  Bakrid  

Other Articles