Ganesh idol at Mumbais richest mandal

Mumbais richest mandal

Goud Saraswat Brahmin seva mandal, GSB mandal, Ganesh Kings Circle, mumbai, Ganesh, Gold Ganesh

Those visiting the Goud Saraswat Brahmin (GSB) Seva Mandal in King’s Circle, Matunga this year will not be treated to a grand idol jewelled with gold and silver ornaments.

మా బంగారు గణపతి.. 250 కోట్లు

Posted: 09/25/2015 10:44 AM IST
Mumbais richest mandal

స్వాతంత్ర్య సమరయోధుడు బాల్‌ గంగాధర్‌ తిలక్‌... ముంబైలో ప్రారంభించిన గణపతి వేడుకలు... నేడు దేశ వ్యాప్తంగా నగరాల గల్లీల నుంచి, పల్లెల వరకూ మారుమోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరిగే ఒకే ఒక ఉత్సవం ఏదైనా ఉందా అంటే అది గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఒక్కటే. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలంటే దేశ వ్యాప్తంగా ఎంతో సందడి నెలకొంటుంది. కొన్ని చోట్ల రెండు మూడడుగుల విగ్రహాలతో పూజలు చేస్తే... మరికొన్ని చోట్ల ఆ విగ్రహాల పరిమాణం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఖైరతాబాద్‌ వినాయకుడు 60 ఏళ్ల కిందట.. ఒక్క అడుగుతో మొదలయ్యి, గతేడాది 60 అడుగులకు చేరుకున్నాడు. ఈ ఏడాది 59 అడుగులతో పరిమాణంతో దర్శనమిచ్చిన స్వామి ఇకపై ఒక్కో ఏడాది ఒక్కో అడుగు తగ్గుతూ కనిపించనున్నాడు.

ఇలా దేశ వ్యాప్తంగా ఈ గౌరీ తనయుడు అనేక రూపాల్లో, అనేక పరిమాణాల్లో లక్షలాది మండపాల్లో కొలువుతీరుతూ కోట్లాది మంది భక్తుల పూజలందుకుంటున్నాడు. ముంబైలో అయితే ఏకంగా బంగారంతోనే గణపతిని అలంకరిస్తారు. ఈ మండపం ఖరీదు 250 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అంతేకాదు.. ఈ మండపానికి ఏకంగా పాతిక కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా గణేష్‌ రూపాలు అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో గణేష్‌ విగ్రహాలు విచిత్ర ఆకారాల్లో సిద్ధమవుతున్నాయి. గణేష్‌ ఉత్సవాలను భక్తితో కాకుండా... ఏదో పోటీల కోసం నిర్వహిస్తున్నట్లు, భక్తుల్ని ఆకట్టుకోడానికి  వెరైటీ గణనాధుల్ని రంగంలోకి దింపుతున్నారు. ఇందుకోసం నెలల ముందు నుంచే ప్రత్యేకంగా కాన్సెఫ్ట్‌లు చెప్పి మరీ విగ్రహాలు తయారు చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాటిల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తూ వినాయకుడి రూపాన్నే మార్చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goud Saraswat Brahmin seva mandal  GSB mandal  Ganesh Kings Circle  mumbai  Ganesh  Gold Ganesh  

Other Articles