Chandrababu Naidu plan to cut expenditure

Chandrababu naidu plan to cut expenditure

AP, Chandrababu Naidu, Expenditure, Defcit, Budget, fligh charges

Chandrababu Naidu plan to cut expenditure. AP cm Chandrababu naidu instruct to IAS, IPS officers to min. their expenditure

పదివేలు దాటితే ఫాలో బాబు ప్లాన్

Posted: 09/24/2015 12:25 PM IST
Chandrababu naidu plan to cut expenditure

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతలా ఖర్చు పెడుతున్నారో అందరికి తెలుసు. విదేశీ పర్యటనల పేరుతో నారా గారు చేస్తున్న ఖర్చు మీద నేషనల్ మీడియా  కూడా రకరకాల కథనాలను ప్రసారం చేసింది. అయితే అయినవాళ్లకు కంచాల్లో.. మిగిలిన వాికి అరటాకుల్లో అన్నట్లు చంద్రబాబు తన వరకు అయితే మాత్రం ఎతైనా ఖర్చు చెయ్యడానికి సిద్దపడ్డారు. కానీ తన ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు మాత్రం కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తే అస్సలు మింగుడుమడటం లేదు. అందుకే వారి ఖర్చు తగ్గుంచుకునేలా కొత్తగా ఓ ప్లాన్ కూడా సిద్దం చేశారు చంద్రబాబు. అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఖజానాకు కాస్తైనా భారం తగ్గిద్దామని చంద్రబాబు గారి ఆతృత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏపి పరిపాలనా వ్యవహారాలను చూడడానికి సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగానే పరిపాలనను నిర్వహించేందుకు చూస్తున్నారు. గతంలో హైదరాబాద్ సెక్రటేరియట్ నుండి పరిపాలనా వ్యవహారాలను చూసిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మారుతున్న పరిస్థితులను బట్టి అడ్మినిస్ట్రేషన్ ను విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఎపి ప్రభుత్వం ఐఎఎస్,ఐపిఎస్ అదికారులకు ఖర్చులపై ఆంక్షలు విధించింది. ప్రత్యేకించి హైదరాబాద్ ,విజయవాడల మధ్య తిరగడం పెరిగినందున ఈ ఆదేశాలు ఇచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎక్కువకాలం ఉంటున్నందున ఉన్నతాధికారులు అక్కడకు తరచు వెళ్లవలసి వస్తోంది. దాంతో ఖర్చు పెరుగుతోందని ఆర్దిక శాఖ భావిస్తోంది.ఈ నేపధ్యంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.దాని ప్రకారం విజయవాడకు విమానం ద్వారా రాను,పోను పదివేల రూపాయల టిక్కెట్ ఖర్చు దాటితే విమాన ప్రయాణం వద్దని,రైలు లేదా సొంత కారు ద్వారా రావాలని సూచించింది. విజయవాడలో స్టార్ హోటళ్లలో బస చేయకుండా టూరిజం హోటళ్లలో ఉండాలని కూడా తెలిపింది. అలాగే సీనియర్ అదికారులు ముఖ్యమంత్రి లేదా ఛీప్ సెక్రటరీ చెబితే తప్ప వేరే సిబ్బందిని వెంటబెట్టుకు రారాదని కూడా ఈ మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Expenditure  Defcit  Budget  fligh charges  

Other Articles