Social Media Netigens Makes Controversial Comments On Modi Government | Narendra Modi News

Social media controversial comments on modi government

social media, social media netigens, modi government, narendra modi controversy, Encryption Policy, modi govt Encryption Policy, social media networks, social media updates, social media news, social media sites, whatsapp users, facebook users, twitter users

Social Media Controversial Comments On Modi Government : Social Media Netigens Makes Controversial Comments On Modi Government For Introducing Encryption Policy

సోషల్ మీడియా దెబ్బకు ‘అబ్బా’ అన్న మోదీ సర్కార్

Posted: 09/22/2015 10:29 AM IST
Social media controversial comments on modi government

నిన్నటివరకు దేశంలో మోడీ నామాన్ని ప్రతిఒక్కరూ జపం చేసేవారు. ‘మోదీ వచ్చాడు.. మంచి రోజులు రానున్నాయి’ అంటూ నినాదాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ఇందుకు భిన్నంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ సర్కార్ చేపడుతున్న వినూత్న విధానాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో ఆయనపై విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు మరో విషయం నేపథ్యంలో నెటిజన్లు మండిపడటంతో.. మోదీ సర్కార్ దిగిరాక తప్పలేదు. ఇంతకీ ఏ విషయంలో ఈ వివాదం చెలరేగింది? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఉగ్రవాదులు ఇంకా రకరకాల నేరాలకు పాల్పడేవారందరూ సోషల్ మాధ్యమాలను ఎక్కువగా వాడుతున్నారన్న విషయాన్ని నిఘావర్గాలు ఎప్పుడో తేల్చాయి. ఈ మధ్య వీటి ద్వారానే ఎక్కువ నేరాలు జరిగినట్లు రుజువయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ భద్రతపై తాజాగా కేంద్రప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చింది. ప్రతిపాదిత ఎన్ క్రిప్టెడ్ చట్టం పరిధి నుంచి వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. కంప్యూటర్, మొబైల్ మాధ్యమంగా జరిగే సమాచార బట్వాడాకు సంబంధించిన అన్ని టెక్ట్స్ మెసేజ్ లను 90 రోజులపాటు కచ్ఛితంగా నిల్వ ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు.. ఆయా మెసేజ్ ల వివరాల కావాలని నిఘా వర్గాలు, విచారణ సంఘాలు అడిగితే.. వాటిని కచ్చితంగా పంచుకోవాలని పేర్కొంది. అలా చేయని పక్షంలో క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలు సోమవారం తయారు చేసింది. అంతే.. ప్రభుత్వం అలా తయారుచేసిందో లేదో ఒక్క రోజులోనే దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రైవేటు మెసేజ్ లపై కేంద్రం పెత్తనం ఏంటని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో జాతీయ ఎన్ క్రిప్షన్ విధానాన్ని సవరిస్తూ.. కేంద్రప్రభుత్వం ఈరోజు (మంగళవారం) ఉదయం ఆఘమేఘాల మీద క్లారిఫికేషన్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాలకు ఈ నూతన విధానం వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడుతున్న వారిపై పెత్తనం చేయడం తమ ఉద్దేశం కాదని, జాతీయ భద్రతాంశాలు ముడిపడివున్న చోట మరింత నిఘా కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపింది.

AS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social media netigens  modi government  whatsapp facebook twitter  

Other Articles