AP CM Chandrababu Naidu Has Given Interesting Speech To Singapore Business Persons About Capital City Amaravathi Development

Chandrababu naidu interesting speech singapore business persons capital city amaravathi development

chandrababu naidu, ap capital city amaravathi, amaravathi development, amaravathi master plan, amaravathi latest updates, chandrababu latest news, singapore business persons, chandrababu in singapore, amaravathi investments

Chandrababu Naidu Interesting Speech Singapore Business Persons Capital City Amaravathi Development : AP CM Chandrababu Naidu Has Given Interesting Speech To Singapore Business Persons About Capital City Amaravathi Development To Gain Investments.

‘అమరావతి’ వృద్ధికోసం చంద్రబాబు నయా ట్రిక్స్!

Posted: 09/22/2015 09:58 AM IST
Chandrababu naidu interesting speech singapore business persons capital city amaravathi development

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని ‘అమరావతి’ అభివృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో వినూత్న విధానాలను ప్రయోగిస్తూ దూసుకెళుతున్నారు. ముఖ్యంగా.. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను రాబట్టే విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల క్రితం సింగపూర్ వెళ్లిన విషయం తెలిసింది. అక్కడ కాలుమోపిన దగ్గర నుంచి ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. సింగపూర్ లో విమానం దిగీదిగగానే రంగంలోకి దిగిపోయి.. అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏసియా స్డడీస్’ సమావేశంలో పెట్టుబడుల విషయమై ప్రసంగించిన చంద్రబాబు.. తన వినూత్న ప్రతిపాదనలతో అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు సంకోచిస్తే.. ముందుగా ఏపీకి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. పరిశీలనలో సానుకూల అంశాలు కనిపిస్తేనే పెట్టుబడులు పెట్టండని ఆయన వారిని ఆహ్వానించారు. ఏపీ రాష్ట్ర రాజధాని కోసం సింగపూర్ సహకరిస్తే.. ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజధానిని తమ ప్రభుత్వం నిర్మిస్తుందని బాబు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా బాబు ప్రసంగానికి అక్కడి పారిశ్రామికవేత్తలను బాగానే ఆకర్షితులయ్యారు.

ఇక ఇటీవల దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో వున్నట్లు ప్రపంచబ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసింది. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత కేవలం 16 నెలల కాలంలోనే నవ్యాంధ్రను దేశంలోనే రెండో స్థానంలో నిలిపిన వైనాన్ని వారికి వివరించారు. భవిష్యత్తులో ఏపీ భారత సిలికాన్ వ్యాలీగా రూపుదిద్దుకోనుందని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city amaravathi  singapore business persons  

Other Articles