Manish Tewari on reservations

Congress leader manish tewari backs rss chief mohan bhagwat on reservations

Reservations, Manish Tewari, RSS, Mohan Bhagat, BJP

Congress leader Manish Tewari backs RSS chief Mohan Bhagwat on reservations A political row broke out over RSS chief Mohan Bhagwat's call for review of reservation policy with BJP opposing it and distancing itself from its ideological mentor and shared the stand taken by Bihar-based parties which said reservation in India is a "settled issue".

ITEMVIDEOS: రిజర్వేషన్లు అవసరమా..?

Posted: 09/22/2015 08:16 AM IST
Congress leader manish tewari backs rss chief mohan bhagwat on reservations

రిజర్వేషన్ల మీద మరో నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారి పోరాటం కారణంగా చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల మీద మనీష్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత కాలం రిజర్వేషన్లు ఉండాలి..? ప్రస్తుతం మనం 21 శతాబ్దంలో ఉన్నా కానీ రిజర్వేషన్లు అవసరమా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్‌ తివారీ ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ రిజర్వేషన్ల తొలగింపు కోసం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనీష్ తివారీ లాంటి వ్యక్తి కూడా రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించడం కొత్త చర్చకు దారి తీసింది. బిజెపి పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను తొలగించాలని తన ఎజెండాలో పొందుపరుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు ఎవరెవరికి, ఎన్నాళ్లకాలం ఉండాలో నిర్ణయించేందుకు కమిటీని నియమించాలి’ అని ఆదివారం ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.

రిజర్వేషన్ల వ్యవస్థపై సమీక్ష మాత్రం అవసరం. 21వ శతాబ్దంలోనూ కోటా ఉండాలా? ఒకవేళ ఉండాలంటే... అది ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే ఉండాలి. కుల ప్రాతిపదికన కాదు. దారిద్య్రమే వెనుకబాటుతనానికి ప్రాతిపదిక అని మనీశ్‌ తివారీ  అభిప్రాయపడ్డారు. వర్గం, కులం, మతాలకు అతీతంగా... ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలన్నారు. అసలు రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనే అంశంపైనే చర్చించాలి. ఉంటే... దేని ప్రాతిపదికన ఉండాలి? కుల ప్రాతిపదిక నుంచి ఆర్థిక ప్రాతిపదికన మార్చాలా? దీనిపై చర్చ జరగాలి అని మనీశ్‌ తివారీ తెలిపారు. గతంలో కాంగ్రె్‌సకే చెందిన జితిన్‌ ప్రసాద, జనార్దన్‌ ద్వివేదీ కూడా రిజర్వేషన్ల కొనసాగింపుపై భిన్నగళం వినిపించారు. వీరిద్దరూ ఏకంగా అధిష్ఠానానికే తమ అభిప్రాయాలు తెలియచేశారు. బలహీన వర్గాల్లోని పేదల్లాగే, అగ్రవర్ణ పేదలూ ఇబ్బందులు పడుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన, ఆక్రోశం అగ్రవర్ణ పేదల్లో పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మండల్‌ రాజకీయాలపై పునఃసమీక్ష అవసరం అని జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సూచించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reservations  Manish Tewari  RSS  Mohan Bhagat  BJP  

Other Articles