Thieves stole Ganesh Laddu in LBNagar

Thieves stole ganesh laddu in lbnagar

Lord Ganesh, Ganesh laddu, lb nagar, Thief, stole, laddu stolen, Hyderabad, CCTVs at Ganesh mantaps

Thieves stole Ganesh Laddu in LBNagar Hyderabad. Thieves stole laddu and hundi at Ganesh Mantaps.

ITEMVIDEOS: వినాయకుడి లడ్డూల దొంగలు

Posted: 09/22/2015 08:20 AM IST
Thieves stole ganesh laddu in lbnagar

దేవుడి సొమ్మును కూడా ఎత్తుకుపోతున్నారు.గణేష్ మంటపాల్లో లడ్డూలకూ రక్షణ కరువైంది. ఏమాత్రం భయం, భక్తీ లేకుండా పట్టుకుపోతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా మాయం చేస్తున్నారు. దేవుణ్ని దర్శించుకుందామని వచ్చే భక్తులకు... కేటుగాళ్ల భయం పట్టుకుంది. మంటపాలకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో జరిగే గణేష్ ఉత్సవాలకు దొంగల బెడద తప్పట్లేదు. దేవుడి సొమ్మును కూడా దర్జాగా పట్టుకుపోతున్నారు. మంటపాల్లో విలువైన వస్తువులన్నీ దొంగలపరమవుతున్నాయి. నిర్వాహకులు పక్కకు తిరిగితే చాలు చోరగాళ్లు హాంఫట్ చేస్తున్నారు. వినాయక చవితిని భారీఎత్తున జరిపే హైదరాబాద్‌లో ఇదో పెద్ద సమస్యైపోయింది. నగర శివారు ప్రాంతాల్లో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. దేవుడి చేతిలో లడ్డూలు కూడా పట్టుకుపోతున్నారంటే... దొంగతనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గణేశుడి లడ్డూకి విపరీతమైన డిమాండ్. నిమజ్జనం రోజున లడ్డూలను వేలం వేయడం ఆనవాయితీ. బాలాపూర్ గణపతి లడ్డూ ఏటా లక్షల్లో పలుకుతుంది. అలాంటి విశిష్టత ఉండే లడ్డూపై దొంగల దృష్టి పడింది.   ఈ చోరీలు ఎక్కువవడంతో కొన్ని మంటపాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. స్మాల్ స్పాట్.

LB నగర్‌లోని ఓ గణేశ్ మంటపం దగ్గర రాత్రి సమయంలో చోరీ జరిగింది. ఇక్కడకు వచ్చిన ముగ్గురు దొంగలు... హుండీ, సౌండ్ సిస్టం, ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు లడ్డూ కూడా పట్టుకుపోయారు. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. స్పాట్ చోరీ చేసిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడ్రోజులుగా ఎల్బీనగర్‌లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఆరు మంటపాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈ గ్యాంగే ఇదంతా చేసి ఉంటుందని పోలీసుల అనుమానం. తమ మంటపాల్ని పోలీసులే కాపాడాలంటున్నారు బాధితులు. ఇప్పటివరకు ఆరు లడ్డూలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lord Ganesh  Ganesh laddu  lb nagar  Thief  stole  laddu stolen  Hyderabad  CCTVs at Ganesh mantaps  

Other Articles