Telangana Govt getting ready to clear Traffic in Hyderabad

Twenty one thouasnd cr to clear traffic

Telangana, Traffic, Hyderabad, 21thousand cr, New Skyways, Raods

Telangana Govt getting ready to clear Traffic in Hyderabad. Telangana govt calling tenders for new flyovers, roads, Express ways, skyways.

ట్రాఫిక్ క్లీయర్ చెయ్యడానికి 21వేల కోట్లు..!

Posted: 09/19/2015 10:56 AM IST
Twenty one thouasnd cr to clear traffic

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టింది రోడ్లు, ప్లై ఓవర్లు నిర్మించేందుకు నేటి నుంచి టెండర్లు పిలువనుంది. 18 జంక్షన్లలో చేపట్టనున్న పనులకు… వెయ్యి 96 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. రోడ్ల నిర్మాణ పనుల్లో పాదర్శకంగా వ్యవరిస్తామన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. స్ట్రాటర్జిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద.. తొలిదశ టెండర్ల ప్రక్రియ ఇవాళ సాయంత్రం నుంచి మొదలు కానుంది. వెయ్యి 96 కోట్ల రూపాయలకు పైగా నిధులతో.. 18 జంక్షన్ల దగ్గర చేపట్టనున్న ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విడగొట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించిన జిహెచ్ఎంసీ అధికారులు.. నవంబర్ తొమ్మిదో తేదీన ప్రైస్ బిడ్లు తెరిచి ఏజెన్సీలను ఫైనల్ చేయనున్నారు.

21వేల కోట్ల రూపాయల అంచనాతో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, ఎక్స్ ప్రెస్ వేలు, స్కైవేలు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఫస్ట్ టర్మ్ లో 18 జంక్షన్ల పరిధిలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. ఈపీసీ – డిఫర్డ్ యాన్యుటీ టెండర్లపై కాంట్రాక్టర్ల డౌట్స్ క్లారిఫై చేశారు అధికారులు.24 నెలల్లోగా పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాలే కాకుండా, భూ సేకరణ సమస్యలు లేని ప్రాంతాలను ఎంపిక చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణ, ఫుట్ పాత్ ల నిర్మాణం, కేబుళ్ల కోసం కామన్ డక్ట్ ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, జాగింగ్ ట్రాక్, క్రాస్ డ్రైన్స్, లైటింగ్ పనులు, సైనేజీలు, రోడ్ మార్కింగ్, రోడ్డుపై ఇల్యుమినేషన్ స్టడ్స్ పనులు చేయనున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.. జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. ప్రతియేటా 700 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Traffic  Hyderabad  21thousand cr  New Skyways  Raods  

Other Articles