selfie | short horror movie

Selfie taking short horror movie has emerged

Selfie, Hell, spooky video, short horror movie, Selfie with Ghost

A video that turns selfie taking into a short horror movie has emerged, and it’s absolutely terrifying. The spooky video, titled ‘Selfie from Hell’ by the YouTube channel ‘F* you Zombie’, has reemerged after its initial uploading in August, to scare everyone who's ever used a front-facing smartphone camera.

ITEMVIDEOS: సెల్ఫీ దిగే వాళ్లకు షాకిచ్చే వీడియో

Posted: 09/19/2015 10:34 AM IST
Selfie taking short horror movie has emerged

సెల్ఫీలు.. ప్రస్తుతం యూత్ ను ఊసేస్తున్న కొత్త ట్రెండ్. చిన్నా పెద్ద అనే తేడా ఏం లేదు... ప్రధాని నుండి ప్యూన్ వరకు.. స్టూడెంట్స్ నుండి కాలేజ్ డీన్ ల వరకు.. హీరోల నుండి సగటు ఆర్టిస్ట్ వరకు అందరూ కూడా సెల్ఫీ మోజులో పడిపోయారు. ఇక నరేంద్ర మోదీగారి పుణ్యమా అని ఆ క్రేజ్ మరింత పెరిగింది. అయితే సెల్ఫీలు దిగే వాళ్లు ఒక్క సారి ఈ వీడియో చూసి తర్వాత దిగండి. ఎంతో మోజుతో సెల్ఫీ దిగుదామని అనుకున్న వాళ్లకు ఈ వీడియో షాకిస్తుంది. సెల్ఫీ ఫ్రం హెల్.. అంటే నరకం నుండి సెల్ఫీ అంటూ టైటిల్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోకు హిట్ లు అంతకంతకు పెరుగుతున్నాయి.

ఓ అందమైన అమ్మాయి... ఫోన్ మాట్లాడిన తర్వాత తన అందానికి మురిసిపోయి సెల్ఫీ దిగాలనుకుంటుంది.. అనుకున్నంతనే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి సెల్ఫీ దిగుతుంది. సరే తన సెల్ఫీ ఎలా వచ్చిందో చూద్దామని చూస్తే షాక్.. సెల్ఫీలో తన వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నట్లు షాడో కనిపిస్తుంది. షాక్ అయిన అమ్మాయి మరోసారి వెనక్కి తిరిగి చూస్తుంది. భయంభయంగా బ్యాక్ కెమెరాతో చుట్టుపక్కల అన్ని వస్తువుల ఫోటోలు తీస్తుంది కానీ ఏమీ కనిపించదు. అప్పుడు కాస్త ఆలోయించిన అమ్మాయి.. మళ్లీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి సెల్ఫీ దిగుతుందడగా.. వెనకాలనుండి ఏదో వచ్చి మీద పడుతుంది. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selfie  Hell  spooky video  short horror movie  Selfie with Ghost  

Other Articles