Two Indian Nationals Kidnapped in ISIS Stronghold Sirte, Libya

2 indians abducted in libya one from ap and another from odisha

Libya,Tripoli,two indians kidnapped,indians kidnapped,Indians abducted,indians libya,MEA Spokesperson,Vikas Swarup,Islamic State,ISIS libya,isis tripoli,kidnapped

Two Indian nationals have been abducted in Libya capital Tripoli, according to the latest reports.

మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనే

Posted: 09/16/2015 07:32 PM IST
2 indians abducted in libya one from ap and another from odisha

ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో బంధీలుగా ఉంచుకున్న ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. మరో ఇద్దరు భారతీయులను బంధీలుగా తమ అధీనంలోకి తీసుకున్నార్న పిడుగులాంటి వార్త వెలువడింది. లిబియా పట్టణంలో వున్న వీరిన ఐఎస్ ఉద్రవాదులు బంధీలుగా తీసుకెళ్లినట్లు సమాచారం. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగా శాఖ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొకరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇది ఇలా ఉండగా, గతంలో నలుగురు భారతీయులను అపహరించిన ఉగ్రవాదులు.. కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలిపెట్టారు. అయితే మరో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను ఉగ్రవాదులు తమ వద్దే బందీలుగా ఉంచుకున్నారు. కాగా, ప్రతి రోజూ సిర్తే విశ్వవిద్యాలయం డీన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం.. ప్రొఫెసర్ల విడుదలలో జాప్యం జరుగుతోందని విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు కూడా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్‌తో ఈ విషయంపై మాట్లాడారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇద్దరు ప్రొఫెసర్లను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు రహస్య ప్రదేశంలో ఉంచారని, సోమవారం సాయంత్రం వరకూ వారు క్షేమంగానే ఉన్నారని సిర్టే యూనివర్సిటీ డీన్ వెల్లడించినట్లు విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారినందున వారిని విడుదలచేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేనందువల్లనే విడుదలలో జాప్యం జరుగుతోందని డీన్ వివరించినట్లు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Islamic State in Iraq and Levant  Libya  Tripoli  Indians  abduction  Indians kidnapped  

Other Articles