విద్యార్థినిని వేధించిన ఓ లెక్చరర్ కు అమె తల్లిదండ్రులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తన కూతురు వయస్సున్న అమ్మాయిని అని కూడా లెక్కచేయకుండా అమెను తాను పరిణయమాడుతానని నిత్యం వేధిస్తూ.. కీచకపర్వానికి తెరతీయడంతో రంగంలోకి దిగిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు కళాశాలకు చేరుకుని లెక్చరర్ దేశశుద్ది చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధించసాగాడు.
గురువు స్తానంలో వున్ననన్న గురుతర భాధ్యతను కూడా మర్చిపోయి తన విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చేసేది లేక తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్‌కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్‌పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more