Sell kidneys to buy iPhone 6S

Chinese men try to sell kidneys to buy iphone 6s

Iphone, Kidney, China, Jiangsu province, iPhone 6S

Chinese men try to sell kidneys to buy iPhone 6S Two men in China's Jiangsu province tried to sell their kidney for Apple's latest offering, iPhone 6S.One of the men, surnamed Wu, wanted an iPhone 6S but could not afford it. His friend Huang suggested they sell a kidney each for money, reported China Daily on.

ఐఫోన్ కొనేందుకు కిడ్నీ అమ్మకం.?

Posted: 09/15/2015 04:16 PM IST
Chinese men try to sell kidneys to buy iphone 6s

అవును.. మీకు చదివింది కరెక్టే... కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొందామని ప్లాన్ వేసుకున్నాడో మహానుభావుడు. అయినా దేనికైనా ఎక్కువగా ఎడిక్ట్ అయితే ఇలానే ఉంటుంది. అవసరాల కోసం కొంత మంది తమ బ్లడ్ ను, కిడ్నీలను, చివరకు కళ్లను అమ్ముకుంటుంటే.. టెక్నాలజీకి దాసోహం అంటూ కొంత మంది ఇలా చేస్తుండటం నిజంగా వింత అనిపిస్తోంది. తాజాగా చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచంలో టెక్నాలజీలో కొత్త శకానికి తెర తీసిన ఐఫోన్ కొత్తగా 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను లాంఛ్ చేసింది. అయితే వరల్డ్ వైడ్ లా ఈ ఫోన్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఐఫోన్ అమ్మాకాల మీద అందరకి ఉన్న పిచ్చి ఎలా ఉందో తెలిపే మరో ఘటన ఇది.

చైనాలో ఉంటున్న వూ అనే వ్యక్తి.. ఐ ఫోన్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్6ను కొనాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే అందుకు తగిన డబ్బులు తనతో లేకపోవడంతో అతడికొ ఆలోచన వచ్చింది. తన కిడ్నీ అమ్మైనా సరే తాను మాత్రం ఐఫోన్ 6ను కొనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే అనుకున్నదే తడువుగా ఓ ఏజెంట్ ను కూడా కాంటాక్ట్ అయ్యాడు. దాంతో అతడు ఆ ఫోన్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు ఇస్తానని ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఇదంతా తన పక్కింటి ఆయనకు చెప్పాడు. అయితే విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఎంతలా వద్దని చెబుతున్నా వినలేదు. చివరకు ఓపిక నశించిన ఆ పక్కింటాయన పోలీసులకు సమాచారం అందించాడు. అయితే పోలీసుల ఎంట్రీతో వూ పారిపోయాడు. మొత్తం వ్యవహారం మీద పోలీసులు డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవడం ఏంటా అని ఆశ్చర్యపోవడం మాత్రం మనవంతైంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iphone  Kidney  China  Jiangsu province  iPhone 6S  

Other Articles