US airports will now treat 2,000 Indians as VVIPS

Us airports will now treat 2 000 indians as vvips

US, Airport, America, VVIP, entry, Indian celebrities

US airports will now treat 2,000 Indians as VVIPS Remember how former president APJ Abdul Kalam and film star Shah Rukh Khan were subjected to embarrassing pat-down searches while travelling to the US? Well, the harrowing experience of going through stringent security drills at US airports will soon become a thing of the past for a select group of Indian celebrities and important personalities.

అమెరికాకు తనిఖీలు లేకుండా వెళ్లొచ్చు

Posted: 09/15/2015 04:28 PM IST
Us airports will now treat 2 000 indians as vvips

అమెరికా.. అగ్రరాజ్యంగా వెలుగుతోంది. అయితే అక్కడికి అన్ని దేశాల నుండి ప్రజలు, ప్రముఖులు వెళుతుంటారు. అయితే అక్కడ విమానాశ్రయాల్లో నిర్వహించే తనిఖీలు చాలా సార్లు.. చాలా దేశాలకు కోపం తెప్పించాయి. అయితే అబ్దుల్ కలాం నుండి అమితాబ్ వరకు ఎంతో మంది భారతీయ ప్రముఖులకు అక్కడి అమెరికా విమానాశ్రయాల్లో చాలా సార్లు అవమానాలు జరిగాయి. అక్కడి అధికారులు తనిఖీల పేరుతో వారిని అడ్డుకోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయితే అమెరికాలో మన ప్రముఖులకు ఇక మీదట ఈ కష్టాలు తప్పనున్నాయి. భారత్ నుండి వచ్చే దాదాపు 2వేల మందికి ఇక మీదట ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా పంపించెయ్యాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు చాలా దేశాలకు చెందిన ప్రముఖులకు ఇక మీదట తనిఖీల బెడద ఉండదు. ఒక్క ప్రముఖులకే కాదు మామూలు వ్యక్తులకు కూడా ఇక మీదట తనిఖీల బెడద తప్పుతుంది. అది ఎలాగో తెలుసుకోండి.



అమెరికా గ్లోబర్ ఎంట్రీ పేరుతో కొత్త ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్ కింద భారత్ ముందుగా రెండు వేలమంది జాబితాను రూపొందిస్తోంది. ఇప్పటికే ఆ జాబితాలోకి సినిమా యాక్టర్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, రాజకీయ నేతలు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పేర్లను ఖరారు చేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ జాబితా కేవలం రెండువేల మందికి పరిమితం కాదని, సెలబ్రిటీలు, వీఐపీల జాబితా ముగిశాక, దరఖాస్తు చేసుకున్న సామాన్య పౌరులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ జాబితాకు ఎంపిక చేసే వారికి ఎవరికీ కూడా నేర చరిత ఉండకూడదని, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడి ఉండరాదని తెలిపాయి. ‘ఎంట్రీ ఫ్రీ’ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి బ్యాగ్రౌండ్‌ను భద్రతా సిబ్బంది ముందుగానే తనిఖీ చేస్తుందని చెప్పాయి. ఈ జాబితాలో ఉన్న వారి లగేజ్‌ను కూడా అమెరికా విమానాశ్రయాల సిబ్బంది తనిఖీ చేయరని, అయితే వారి దేశంలో అడుగుపెట్టినట్లు తెలుసుకోవడానికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలు ముద్రలు తీసుకుంటారని ఆ వర్గాలు వివరించాయి. మొత్తానికి అమెరికా మనవాళ్లకు మొన్నటి దాకా ఉన్న తనిఖీల బెడద దాదాపు ఉండదనే చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  Airport  America  VVIP  entry  Indian celebrities  

Other Articles