Topless Female Protesters Disrupt Muslim Conference (NSFW)

Femen stages topless protest at muslim women s fair

muslim women topless protest, Topless Female Protesters, Muslim conference in Paris disturbed, anti muslim, Nobody makes me submit, I am my own prophet, muslim women, anti muslim, topless protest, muslim conference, paris

Two topless female activists stormed the stage of a Muslim conference in Paris, with the messages "Nobody makes me submit" and "I am my own prophet" written on their torsos,

ITEMVIDEOS: ఇస్లాం సదస్సులో మహిళల అర్థనగ్న నిరసన

Posted: 09/15/2015 02:59 PM IST
Femen stages topless protest at muslim women s fair

ఫ్రాన్సు రాజధాని పారిస్ నగరంలో జరుగుతున్న ఓ సదస్సులో ఇద్దరు యువతులు వినూత్నంగా నిరసన ప్రదర్శించారు. అర్ధనగ్నంగానే వేదిక పైకి వచ్చి కలకలం సృష్టించారు. ‘మహిళలు-ఇస్లాం’ అనే అంశంపై సదస్సు జరుగుతుండగా తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఆ మహిళలు టాప్‌లెస్‌గా వేదిక పైకి వచ్చారు. వారి ఛాతీ, వీపై భాగాలపై ‘నాకు నేనే ప్రవక్తను, నాకెవరూ అదేశాలు ఇవ్వలేరు’ అని నినాదాలు రాసుకున్నారు. వాటినే వేదికపై గట్టిగా అరుస్తూ చెప్పారు. మైక్‌లను విరగొట్టేశారు. తొలుత ఆశ్చర్యపోయిన రక్షణా సిబ్బంది అనంతరం వేదికపైకి వచ్చి వారిద్దరిని కింద పడేసి కాళ్లతో తన్నుతూ కిందకు లాక్కెళ్లిపోయారు.

కాగా, ఆ సమయంలో వేదికపైన ఉన్న ఇమాంలు ‘మీరు మీ భార్యలను కొట్టాలా? వద్దా?’ అనే అంశంపై చర్చిస్తున్నట్టు తెలిసింది. దీనికి నిరసనగానే ఆ యువతులు తమ నిరసన తెలిపినట్టు సమాచారం. ఈ నిరసనకు పాల్పడింది ఓ స్త్రీ వాద సంస్థ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ గ్రూప్ 2008లో ఉక్రెయిన్‌లో ఏర్పడింది. వారు అర్ధనగ్నంగా, లేద నగ్నంగా తమ నిరసనను తెలియజేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఈ ఏడాది మేడే సందర్భంగా ఫ్రెంచ్ ఫార్-రైట్ లీడర్ మెరైన్ లీ ఉపన్యాసం సందర్భంగా కూడా ఈ గ్రూప్‌నకే చెందిన ఓ మహిళ నగ్నంగా వేదికపైకి వచ్చి నాజీలకు సెల్యూట్ చేస్తూ గందరగోళం సృష్టించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muslim women  anti muslim  topless protest  muslim conference  paris  

Other Articles