ap has the unlimited chances

Ap cm chandrababu naidu said that the state has all resources to establish industries

AP, Chandrababu Naidu, Industries, Resources, Growth Rate, Development

AP CM Chandrababu Naidu said that the state has all resources to establish industries. The state govt also bringing good industrial policies for industries.

ఏపిలో అవకాశాలు అన్ లిమిటెడ్

Posted: 09/15/2015 09:06 AM IST
Ap cm chandrababu naidu said that the state has all resources to establish industries

విస్తారమైన ఖనిజ సంపద, జల వనరులు, విద్యుత్‌ మిగులు వంటి అంశాలకు తోడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో బైరటీస్‌, సున్నపురాయి, బీచ్‌శాండ్‌, గ్రానెట్‌ వంటి ఖనిజ సంపదకు తోడు సింగరేణి కాలరీలకు కొనసాగింపుగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బొగ్గు గనులు ఉనాయని చంద్రబాబె వెల్లడించారు.  రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల అనుసంధా నంతో నీటి వసతికి లోటు ఉండదన్నారు. నాణ్యమైన విద్యుత్‌ 24 గంటలు పరిశ్రమలకు అందించగలమని స్పష్టం చేశారు. హేతుబద్దంగా లేని రాష్ట్ర విభజన, ఎన్నో సమస్యల్ని తమ ప్రభుత్వం ముందుంచిందన్నారు.

సుమారు 15 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను మిగిల్చిందన్నారు. రాష్ట్రాభివృద్థి కోసం 9 మిషన్లు -40 గ్రోత్‌ ఇంజన్లు గుర్తించి, ప్రణాళికబద్ధంగా పని చేస్తున్నామని తెలిపారు. ఫలితంగా రెవెన్యూ రాబడులు పెర గడంతో పాటు, ఈ ఏడాది తొలి మూడు నెలలకు 9.72 శాతం గ్రోత్‌ రేటును సాధించగలిగామన్నారు. కృష్ణా, గోదావరిని అనుసంధానించినట్లుగానే రాష్ట్రంలో రాబోయే 6 లేదా 7 సంవత్సరాల్లో అన్ని నదుల్ని అనుసంధానించి సాగు, తాగు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. కరువు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడతామన్నారు. శ్రామిక చట్టాల విషయంలో ప్రభుత్వం సరళంగా ఉందన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే తత్వం ఉన్న కార్మికులకు కొదవలేదన్నారు. కార్మికులలో ఆశాంతి లేదని, యాజమాన్యాలు సైతం వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. దేశంలోను, రాష్ట్రం లోను మానవ వనరుల్లో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధం గా యువ జనాభా అత్యధిక శాతంలో ఉన్నారని, వీరి ఉత్పా దక శక్తికి నైపుణ్యాన్ని జోడించేందుకు సాంకేతిక విప్లవాన్ని వినియోగిస్తున్నామన్నారు. స్థానిక యువ పారిశ్రామికవేత్త లతో ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహించి, వారిని భాగ స్వాముల్ని చేస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం ప్రారంభంకానున్న దృష్ట్యా పోర్టువేరు, రియల్‌ ఎస్టేట్‌, సేవ లు, పర్యాటక రంగాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నా యని, వీటిని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Industries  Resources  Growth Rate  Development  

Other Articles