Maybe telangana govt cancel interviews for jobs

Central govt order to cancel interviews for all jobs except group 1 level

Telangana, TSPSC, Interview, Groups, Group2, Modi, Jobs

Central Govt order to cancel interviews for all jobs except group 1 level. Central govt wrote a letter to telangana govt, to cancel the interview tests in the job filling.

గ్రూప్ 1 తప్ప అన్నింటికి ఇంటర్వూలు రద్దు..!

Posted: 09/15/2015 09:03 AM IST
Central govt order to cancel interviews for all jobs except group 1 level

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భర్తీ చెయ్యనున్న ఉద్యోగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వూ నిర్వహించాలని టిఎస్ పిఎస్సీ నిర్ణయంతీసుకుంది. అయితే దీని మీద చాలా మంది మేధావులు కూడా అభ్యంతరం తెలిపారు. కానీ కేడర్ పెద్దది కనుక ఖచ్చితంగా ఇంటర్వూ నిర్వహించాల్సిందే అంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అంతకు ముందు గ్రూప్ 2లో ఎలాంటి ఇంటర్వూ టెస్ట్ లు లేవు. కానీ టెక్నికల్, నాన్ టెక్నికల్ క్యాడర్ లను విభజించిన తర్వాత మాత్రం ఇంటర్వూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ లెవల్ అధికారి పోస్టులకు ఇంటర్వ్యూలను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ చెప్పినట్లు అన్ని  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రూప్ 1 కేటడ్ మినహా ఏ ఉద్యోగాలకు ఇంటర్వూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది.

తాజాగా గ్రూప్-1 మినహా అన్ని గ్రూప్స్  ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీవోపీటీ శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. డీవోపీటీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కోతన్ రాసిన లేఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. ఈ నేపథ్యంలో జూనియర్ లెవల్ పోస్టులకు ఎక్కడైనా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటే నిలిపివేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని డీవోపీటీ తన లేఖలో పేర్కొంది. అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు, నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ చర్యను చేపట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించారని తెలిపింది. మెరిట్ ఆధారంగానే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రధాని స్పష్టం చేశారని వివరించింది. జూనియర్ లెవల్ ఆఫీసర్ పోస్టులను గుర్తించి వాటి భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటే రద్దు చేయాలని.. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది.

మొత్తానికి ఎంతో కాంలగా నడుస్తున్న ఇంటర్వూ సస్పెన్స్ కు ఇప్పటికైనా తెర పడుతుందని చాలా మంది నిరుద్యోగులు, మేధావులు ఆవిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి వాటి భర్తీలో స్థానిక పబ్లిక్ సర్వీస్ కమీషన్ లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా వచ్చింది. కాబట్టి కేంద్రం ఆదేశాలను ఖచ్చింతగా పాటించాలని రాష్ట్రానికి లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపధ్యంలో కూడా కేంద్రం ఆదేశాలనుండి తమకు మినహాయింపు కలిగించాలని అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగాల భర్తీలో గతంలో ఎన్నో అవకతవకలు జరిగిన నేపధ్యంలో తెలంగాణ సర్కార్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TSPSC  Interview  Groups  Group2  Modi  Jobs  

Other Articles