Mumbai Court Granted Divorce To Husband From Wife | Condoms Controversy | Women Controversy

Mumbai court granted divorce to husband from wife condoms controversy

mumbai bandra court, interesting divorce case, court granted divorce to husband, husband divorce wife, mumbai sessions court, bandra court

Mumbai Court Granted Divorce To Husband From Wife Condoms Controversy : Mumbai Court Granted Divorce To A Husband From His Wife Because She Was Not Accept For Physical Relationship.

కండోములతో వేధించిన భార్యకు భర్త గుణపాఠం!

Posted: 09/14/2015 03:59 PM IST
Mumbai court granted divorce to husband from wife condoms controversy

పెళ్లైన తర్వాత దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుదామని భావించిన ఓ భర్తకు అతగాడి భార్య మొదటి రాత్రే చుక్కలు చూపించింది. దాంతో నిర్ఘాంతపోయిన అతగాడు.. ఏమీ చేయలేక మౌనంగా వుండిపోయాడు. తర్వాతి రోజునుంచైనా మారుతుందని ఆ వ్యక్తి భావించాడు కానీ.. అలాంటిదేమీ జరగపోగా అతనిని ఇంకా వేధించసాగింది. దాంతో అతగాడు తన భార్యను ఓ గురువు వద్దకు తీసుకెళ్లి, దాంపత్య జీవితానికి సంబంధించి హితబోదా చేయించాడు. అయినప్పటికీ ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. ఆమెను మార్చేందుకు కొన్నాళ్లపాటు నానాతంటాలు పడ్డాడు. చివరికి భరించలేక ఆమెను తనదైన శైలిలో గుణపాఠం నేర్పాడు. ఎంతో ఆసక్తికరంగా వున్న ఈ కేసు ముంబైలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2011లో ఓ యువకుడికి వివాహం అయింది. పెళ్లి తర్వాత తన జీవితంలో సంతోషంగా కొనసాగుతుందని ఎన్నో ఆశలు కన్నాడు. సాధ్యమైనంత త్వరగా పిల్లలను కనాలని కోరుకున్నాడు. కానీ.. అతని భార్య ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. తొలిరాత్రే ప్యాకెట్ల కొద్దీ కండోములు తీసుకొచ్చిందట. తనకు పిల్లలు వద్దని తెగేసి చెప్పిడమే కాకుండా.. లైంగిక జీవితానికి చాలానే కండిషన్లు పెట్టిందట. దీంతో ఖంగుతిన్న అతగాడు.. ఆ తొలిరాత్రి సైలెంట్ అయిపోయాడు. ఆమెలో మార్పు వస్తుందని అతగాడు భావించాడు. కానీ.. ఆమెలో ఏమార్ప కనిపించకపోవడంతో.. ఆమెను గురువు దగ్గరకు తీసుకెళ్లి హితబోధ చేయించాడు. అయినప్పటికీ ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన అతడు.. తన భార్య నుంచి తనని విముక్తి కలిగించాలని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

ఈ ఆసక్తికరమైన కేసును విచారించిన ముంబైలోని బాంద్రా సెషన్స్ కోర్టు.. వారిరువురి వాదోపవాదాలను వినింది. ఈ నేపథ్యంలో ఆమె.. తన భర్త అసహజ శృంగారాన్ని కోరుతున్నాడని వాదించింది. అయితే.. ఆమె ఆరోపణలను నమ్మని కోర్టు, ఆమె వాదన సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో భర్త మానసిక వేదన కనిపిస్తోందని, ఆయన విడాకులు పొందేందుకు అర్హుడని న్యాయమూర్తి ఎస్ఏ మోరే అభిప్రాయపడ్డారు. వివాహం చేసుకుని సుఖపడాలన్న యువకుడి కోరికలు కల్లలయ్యాయని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చివరగా.. భర్త కోరుకున్న విధంగా లైంగిక జీవితాన్ని అందించడంలో విఫలమైన భార్య చర్యలను తప్పుబడుతూ కోర్టు ఆ యువకుడికి విడాకులు మంజూరు చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court Granted Bail To Husband  Interesting Divorce Case  

Other Articles