how to call Chandrababu Naidu

How to call chandrababu naidu

chandrababu, Gudiwada Amarnath, AP, Farmers, Gannavaram, Airport, chandrababu naidu

how to call Chandrababu Naidu. Chnadrababu naidu turns into chandranna for farmers. Gudiwada Amarnath commented in chandrababu Naidu for his chandranna name.

చంద్రన్న అనాలా..? చంద్రబాబు తాత అనాలా..?

Posted: 09/14/2015 04:01 PM IST
How to call chandrababu naidu

నారా చంద్రబాబు నాయుడు.. ఏపికి సబందించిన, టిడిపికి సంబందించిన అన్ని పబ్లిసిటి పోస్టర్ల మీద చంద్రన్న రాజ్యం అని రాసి ఉంటుంది. అయితే చంద్రన్న రాజ్యం.. లేదంటే రైతుల కోసం చంద్రన్న అని రాసిన దాని మీద కొత్త చర్చకు తెర తీశారు ఓ వైసీపీ నేత. గుడివాడ అమర్నాథ్ రెడ్డి లేవదీసిన అంశం అటు టిడిపిలోనూ.. ఇటు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడును చంద్రన్న అనాలా..? లేదంటే చంద్రబాబు తాత అనాలా..? అన్న దాని మీద చర్చకు తెరతీసేలా వ్యాఖ్యలు చేశారు అమర్నాధ్ రెడ్డి. ఇంతకీ అతను చంద్రబాబు నాయుడు గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటా..? మరి మొత్తానికి చంద్రబాబును ఏమని పిలవాలి అన్న దాని మీద క్లారిటీ రావాలంటే స్టోరీ చదవాల్సిందే.

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు.. రైతులకు కరెంట్ సప్లై, రైతులకు రుణ మాఫీల మీద ప్రచారం చేస్తూ.. చంద్రన్న అని భారీగా ప్రచారం చెయ్యడం మామూలే. అయితే రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రైతన్నల కోసం చంద్రన్నగా అవతారం ఎత్తారని... తాత వయస్సులో చంద్రన్నగా మారారని విమర్శించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కోసం రైతుల నుండి భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పేరుతో అసలు గ్రీన్ ఫీల్డ్ లేకుండా చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడును ఏమని పిలవాలో అన్నదాని మీద క్లారిటీ ఇవ్వకుండా కేవలం విమర్శలు చేశారు గుడివాడ అమర్నాథ్ రెడ్డి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Gudiwada Amarnath  AP  Farmers  Gannavaram  Airport  chandrababu naidu  

Other Articles