AP Govt Making A Plan To Built Another Dam On Krishna River | Chandrababu Naidu | AP Capital City Amaravathi

Another dam on krishna river andhra pradesh government chandrababu naidu

krishna river, prakasham barrage, another dam on krishna river, ap krishna river, ap government, andhra pradesh government schems, ap new schemes, chandrababu naidu, chandrababu schemes, dam on krishna river, krishna dam, amaravathi, ap capital city

Another Dam On Krishna River Andhra Pradesh Government Chandrababu Naidu : AP Govt Making A Plan To Built Another Dam On Krishna River To Get Drinking Water For AP Capital State Amaravathi People.

కృష్ణమ్మపై మరో ఆనకట్ట.. ఎందుకంటే..

Posted: 09/12/2015 10:45 AM IST
Another dam on krishna river andhra pradesh government chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానదిపై మరో ఆనకట్ట నిర్మించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, కృష్ణా జిల్లాలోని గనిఆత్కూరు గ్రామాల మధ్య ఈ బ్యారీజీని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న ఈ డ్యాం నిర్మాణం వెనుక ఓ బలమైన కారణం కూడా వుంది. అదేమిటంటే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ తాగునీటి సమస్యలు తీర్చేందుకే దీనిని నిర్మిస్తున్నారు.

కృష్ణమ్మపై బ్యారేజీ కట్టడం ద్వారా నీటి అవసరాలు తీరడంతోపాటు పర్యాటకంగానూ అభివృద్ధికి బాటలు పడతాయని అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఈ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీ వల్ల మరో ప్రయోజనం కూడా వుంది. అదేమిటంటే.. మెట్ట ప్రాంతాల్లో భూగర్భ నీటి పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ నిలబడే నీటిని 60 లక్షల మంది ప్రజల అవసరాలకు వాడుకోవచ్చట. అలాగే.. అదనపు లభ్యతను బట్టి రాయలసీమకు సులువుగా తరలించవచ్చన్నది బాబు సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఈ బ్యారేజీ నిర్మించేందుకు వైకుంఠపురం ప్రాంతం అనుకూలమని అధికారులు సైతం తేల్చారు. ఇక కేవలం సర్కార్ రంగంలోకి దిగడమే ఆలస్యం. ఏదేమైనా.. ‘అమరావతి’ వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. బ్యారేజీ నిర్మాణానికి అధికారులు తేల్చిన వైకుంఠపురం ప్రాంతం ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన ఉంది. ఇక్కడ ఓ కొండను తాకుతూ నది ఉత్తర దిశగా తిరుగుతుంది. ఎద్దువాగు, మున్నేరు, పాలేరు, వైరా, కట్లేరు తదితర చిన్న నదులు ఈ ప్రాంతంలోని నదిలో కలుస్తాయి. ఇక్కడ నది వెడల్పు కూడా చాలా ఎక్కువ. మొత్తం 3 కి.మీ. పైగా ఆనకట్టను నిర్మించాల్సి వుంటుంది. సుమారు 15 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకోవచ్చు. నది మధ్య లంక భూమి ఉన్నందున పర్యాటకంగానూ అభివృద్ధి బాటలు పడుతుంది. ఇన్ని అనుకూలతలు వుండటం వల్లే ఏపీ ప్రభుత్వం కృష్ణమ్మపై మరో బ్యారేజీకి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna river dam  chandrababu naidu  ap capital city amaravathi  

Other Articles