Full water in all dams in telugu states

Heavy rains falling from last four days in telugu states

Heavy Rains, AP, Telangana, dams, Rains in telugu states

Heavy Rains falling from last four days in telugu states. In AP And also telangana, heavy rains brougt water flow in all dams.

వర్షాలు ఫుల్.. జలాశయాలు కూడా ఫుల్

Posted: 09/12/2015 08:45 AM IST
Heavy rains falling from last four days in telugu states

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో జోరుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వానలు ఇప్పుడిప్పుడే జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే నదులు జలకళ సంతరించుకోగానే ఇక్కడ పడుతున్న వర్షాలకు చెరువులు, వాగులు నిండుతున్నాయి. హైదరాబాద్ లో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షం పడడంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లడంతో బస్తీవాసులు నిద్రాహారాలు మరచి ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతూ జీవిస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ పిడుగులు తోడవ్వడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు.

గత నాలుగు రోజులుగా ఏపీ,తెలంగాణలో వానలు ముంచెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 58,280 క్యూ సెక్కులుగా ఉంది. దీంతో ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 813 అడుగులకు చేరింది. ఇక సుంకేశుల ప్రాజెక్టు వద్ద 8 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 40 వేల క్యుసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 30వేల క్యుసెక్కులు ఉంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో 11, 357 క్యుసెక్కులుగా ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నీటిమట్టం 1625 అడుగులకు పెరిగింది. తుంగభద్ర జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 73.58 టీఎంసీలు. జూరాలలో ప్రస్తుతం 318.35 మీటర్ల నీటిమట్టం ఉంది. ఇన్ఫ్లో 16,454 క్యుసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 20,750 క్యుసెక్కులుగా ఉంది. జూరాలలో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని స్పష్టంచేశారు. దీంతో ఉభయరాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Rains  AP  Telangana  dams  Rains in telugu states  

Other Articles