Seven questions for Jagan

Ap minister ravela kishore babu rise seven questions to ysrcp president jagan

Jagan, Ravela Kishore Babu, Chandrababu Naidu, Special status, AP, Polavaram

AP Minister Ravela Kishore babu rise seven questions to YSRCP President Jagan. He said that Jagan must answer this seven qwuestions and then go for protest on special status.

జగన్ కు ఆ ఏడు ప్రశ్నల సమాధానాలు తెలుసా..?

Posted: 09/11/2015 12:43 PM IST
Ap minister ravela kishore babu rise seven questions to ysrcp president jagan

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నడో స్కూలింగ్ ముగించుకువచ్చారు. కానీ తాజాగా ఓ మంత్రి గారు స్కూల్ లో అడిగినట్లు మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అయినా అయినా ఆ మంత్రి గారు జగన్ ను ఎందుకు ప్రశ్నించారు..? ఏం ప్రశ్నలు అడిగారు..? ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా..? ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జగన్ కు ఏడు ప్రశ్నలు అడిగారు.  దీక్ష చేసే ముందు తాను వేసే ప్రశ్నలకు జవాబు చెప్పాలని జగన్ కు సవాల్ విసిరారు మంత్రి. ప్రత్యేక హోదా సాధన కోసం దీక్ష చేస్తానని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రుల మాటల యుద్ధం కొనసాగుతోంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానం గురించి మాట్లాడని జగన్.. ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడతారని రావెల కిషోర్ బాబు నిలదీశారు. ప్రభుత్వానికి జగన్ సహేతుకమైన సూచనలు ఇస్తే తీసుకుంటామని.. కాని ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తే మాత్రం ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని  హెచ్చరించారు.

రావెల కిషోర్ బాబు అడిగిన ప్రశ్నలు....
1. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అవరోధాలు సృష్టిస్తున్నా జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
2. హైదరాబాద్ లోని సీమాంధ్రుల హక్కుల గురించి జగన్ ఏనాడైనా మాట్లాడారా..?
3. కోర్టు తీర్పులకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ జీవోపై జగన్ మాట్లాడారా..?
4. సెక్షన్-8పై ఇంత రాద్ధాంతం జరిగినా ఎందుకు స్పందించలేదు?
5. ఆంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్ధుల ఫీజు రీఎంబర్ మెంట్స్ గురించి ఏనాడైనా ప్రశ్నించారా..?
6. 1200 మంది విద్యుత్ ఉద్యోగులను తొలగించినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదు
7. తెలంగాణలో తన ఎమ్మెల్యేలను కాపాడుకోకుండా రెండుకొంటే ఒకటీ ఫ్రీ అని ఉన్న ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ కు అప్పగించడం నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Ravela Kishore Babu  Chandrababu Naidu  Special status  AP  Polavaram  

Other Articles