Satyam scam: Sebi asks B Ramalinga Raju & family, others to return Rs 1,800 crore

Sebi asks raju family others to return rs 1 800 crore

satyam scam, b ramalinga raju, sebi, sebi satyam scam, sebi insider trading, sebi ramalinga raju penalty, satyam ramalingaraju, sebi orders, Rs 1849 crores, insider trading, sebi

In a fresh order in the nearly seven-year old Satyam scam case, regulator Sebi asked 10 entities linked to the main accused B Ramalinga Raju -- including his mother, brother and son -- to disgorge over Rs 1,800 crore worth of illegal gains made by them.

సత్యం రామలింగరాజుకు మరో షాక్.. కీలక అదేశాలు జారీచేసిన సెబీ

Posted: 09/10/2015 09:01 PM IST
Sebi asks raju family others to return rs 1 800 crore

సత్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా వున్న సత్యం రామలింగరాజుకు మరో షాక్ తగిలింది. ఈ కుంభకోణానికి సంబంధించి సెబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన మొత్తం తో పాటు అపరాధ రుసుమును కూడా తమకు జమచేయాలని అదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సత్యం రామలింగరాజు లేని లాభాలను వున్నట్లుగా చూసి అక్రమంగా సంపాదించిన సుమారు రూ. 1849 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన కుటుంబంతో సహా పది మందిని ఆదేశించింది.

దీంతో పాటు మరో రూ. 1500 కోట్ల వడ్డీని కూడా అపరాధ రుసుముగా చెల్లించాలని పేర్కొంది. 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగు చూసింది. లేని లాభాలు ఉన్నట్లు చూపి సంస్థ నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగించినట్లు సత్యం రామలింగ రాజు స్వయంగా వెల్లడించడంతో ఈ భారీ కుంభకోణం బయట పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి గత ఏడాది జులైలో సెబీ జారీ చేసిన ఉత్తర్వులకు అనుబంధంగా తాజాగా ఈ నోటీసులు ఇచ్చింది. స్టాక్ మార్కెట్ ద్వారా అక్రమంగా సంపాదించిన రూ.1849 కోట్లను తిరిగి చెల్లించాలని రామలింగరాజు కుటుంబంతో సహా పది మందికి సెబీ ఆదేశాలు జారీ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam scam  satyam ramalingaraju  sebi orders  Rs 1849 crores  insider trading  sebi  

Other Articles