Water flow incresed in dams at telugu states

Water flow increased in dams

water, Rains, Dams, Telugu states, Krishna River, Tungabhadra river

Water flow incresed in dams at telugu states. By the last two days rains water flow increased in the dams.

మొన్న విలవిల. నేడు జలకళ

Posted: 09/09/2015 12:39 PM IST
Water flow increased in dams

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతకంతకు దారుణంగా మారింది. నీరు లేక జలాశయాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. తెలుగు నేల నీటి చుక్క కోస ఎదురు చూస్తోంది... ఇలా రకరకాల వార్తలు రాసిన మీడియా ఇప్పుడు అన్ని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి అనే వార్తలు రాస్తున్నాయి. నిన్నటి దాకా డెడ్ ప్టోరేజీకి వచ్చిన నీటి మట్టం వర్షాల కారణంగా కాలువల ద్వారా నీరు జలాశయాలకు చేరి నీటి మట్టం పెరిగింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఎట్టకేలకు ప్రాజెక్టులకు జలకళ వస్తోంది. సుంకేసులతో మొదలుపెట్టి పలు ప్రాజెక్ట్‌లలోకి ఇన్‌ఫ్లో భారీగా ఉండండతో.. కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతి కనిపిస్తోంది. ప్రస్తుతం డెడ్‌స్టోరేజ్‌కి చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది.

నిన్న దాదాపు రెండున్నర టీఎంసీల నీరు చేరినట్టు అంచనా వేస్తున్నారు. సుంకేసుల దాదాపుగా నిండడంతో 10 గేట్లు అడుగుమేర తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ అవుట్‌ఫ్లో నిన్న లక్షా 60 వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 45 వేల క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. ఈ వరదంతా శ్రీశైలంకు చేరుతుండడంతో నీటి కష్టాలు కాస్తలో కాస్త తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ నుంచి నాలుగైదు రోజులు ఇదే ఇన్‌ఫ్లో ఉంటే పరిస్థితి మెరుగుపడుతుందని శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. డ్యామ్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులైతే, ప్రస్తుతం 800 అడుగుల మేర నీరుంది.  మొత్తానికి తుంగభద్ర, కృష్ణా నదులు నీటితో రైతుల కంట ఆనంద భాష్పాలను తీసుకువస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : water  Rains  Dams  Telugu states  Krishna River  Tungabhadra river  

Other Articles