BSES seeks Rs 5000 crore in damage

Anil dhirubhai ambani groups bses limited seeks rs 5000 crore in damage

Times Of India, BSES, BSES Limited, damage, Court, notices, Reliance Group, Anil Ambani

BSES Limited, a company in the Anil Dhirubhai Ambani Group (ADAG), has sought Rs 5,000 crore as damages from Bennett, Coleman and Company Limited (BCCL), publishers of the Times of India, for allegedly defamatory articles printed by the newspaper in August 2015.

ఆ పత్రిక మీద ఐదు వేల కోట్ల దావా

Posted: 09/09/2015 11:09 AM IST
Anil dhirubhai ambani groups bses limited seeks rs 5000 crore in damage

మీడియా.. అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియేటర్ గా ఉంటడం కానీ కొన్ని ఛానళ్లు, పత్రికలు చేస్తున్న అతి అందరిని అభాసుపాలు చేస్తోంది. అయితే అభాసుపాలు కావడం మాట అటుంచితే తాజాగా మీడియా చరిత్రలోనే అతి భారీ పరువు నష్టం నోటీసు అందుకుంది టైమ్స్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా దీని మీదే చర్చసాగుతోంది. టైమ్స్ నౌలో అర్నాబ్ గోస్వామి మీద ఇప్పటికే చాలా మంది విమర్శల వర్షం కురిపిస్తుంటారు. అరిచి, గీపెట్టి, చర్చలో తన మాటే వేదంలా చేస్తుంటారని అర్నాబ్ కు పేరుంది. అయితే తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా మీద దేశంలోనే అతి భారీ పరువు నష్టం దావా దాఖలు కావడం అటు కార్పోరేట్ వర్గాల్లో, ఇటు మీడియా చానల్స్ లో చర్చనీయాంశంగా మారింది. టైమ్స్ ఆప్ ఇండియా మీద అంత భారీ పరువు నష్టం దావాను వేసింది ఎవరు..? ఎందుకు వేశారు..? అన్న ప్రశ్నలకు సమాధానాలు మొత్తం స్టోరీ చదివితే దొరుకుతాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా కు భారీ పరువు నష్టం దావా వేస్తు నోటీసులు జారీ చేసింది ఎవరో కాదు అనిల్ అంబానికి చెందిన బిఎస్ఈఎస్  కంపెనీ. ఇంగ్లీష్ డెయిలీలో దేశంలోనే నెంబర్ వన్ అయిన టైమ్స్ అనిల్ కంపెనీలపై పలు స్పెషల్ స్టోరీస్ ను పబ్లిష్ చేసింది. అయితే ఇవన్నీ కాగ్ నివేదిక ఆధారంగా రాసినవే.. ఢిల్లీలో విద్యుత్ పంపిణీ చేసే కంపెనీల్లో బిఎస్ఈఎస్  రాజధాని,  బిఎస్ఈఎస్  యమునా పవర్ లు కూడా ఉన్నాయి. విద్యుత్ డిస్టిబ్యూషన్ కంపెనీల పనితీరుపై కాగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ నివేదికలోని అంశాల ఆధారంగా టైమ్స్ పత్రిక పలు కథనాలు రాసింది. ఢిల్లీ విద్యుత్ కంపెనీలు 8 వేల కోట్ల మేర పెంచి చూపాయని, మీటర్ల ద్వార ఎక్కువ మొత్తాన్ని పంపిణీ కంపెనీలు పొందాయని కథనాలను ప్రచురించింది. అయితే కోర్టు కేసు విచారిస్తుండగా ఇలాంటి వార్తలు రాయడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అవుతుందని బిఎస్ఈఎస్ తన నోటీసులో పేర్కొంది. ఈ ఉత్తర్వులును టైమ్స్ ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్ కు పేరు ఉందని ప్రజా ప్రయోజనం దృష్టిలో ఉంచుకొనే కథనాలను ప్రచురించినట్లు సమాధానమిచ్చింది. ఇంతకీ బిఎస్ఈఎస్ కంపెనీ టైమ్స్ ఆప్ ఇండియా మీద ఎంత దావా వేసిందో తెలుసా..? అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Times Of India  BSES  BSES Limited  damage  Court  notices  Reliance Group  Anil Ambani  

Other Articles