Indian Army To Get 155mm Dhanush Gun Weapon Soon Which Is Very Dangerous | Indian Army | Indian Weapons

Dhanush gun weapon indian army make in india

dhanush gun, indian army, dhanush gun weapon, dhanush weapon for army, indian army updates, indian weapons, dhanush dangerous weapon

Dhanush Gun Weapon Indian Army Make In India : Indian Army To Get Dhanush Gun Weapon Soon Which Is Very Dangerous. This Is 45 Caliber 155mm Gun.

భారత్ సైన్యానికి ‘ధనుష్’ ఆయుధం

Posted: 09/09/2015 10:53 AM IST
Dhanush gun weapon indian army make in india

భారతదేశం శాంతియుతంగా స్నేహస్తాన్ని చాచి చూపుతుంటే.. దాయాది దేశమైన పాకిస్తాన్ మాత్రం నిరంతర దాడులతో తన పైశాచికాన్ని ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ ఇండియా స్నేహాభావంతో మెలుగుదామని ఎన్నిసార్లు పిలుపునిచ్చినా.. వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తమ ఇష్టానుసారంగా దాడులు చేయడం, గోప్యంగా తమ అనుచరులను ఇండియాలోకి పంపి మారణహోమాలు సృష్టించడం లాంటి దుర్ఘటనలకు పాల్పడుతోంది. కేవలం పాక్ మాత్రమే కాదు.. చైనా కూడా ఈ తరహాలోనే దేశంపై దాడులకు దిగుతోంది. దీంతో కాస్త కోలుకున్న భారత్.. వారి దాడులను ఎదుర్కొని సరైన సమాధానం చెప్పే దిశగా పావులు కదిపింది. అందులో భాగంగానే భారత సైన్యానికి సరికొత్త ఆయుధాన్ని అందివ్వనుంది. దాని పేరే ‘ధనుష్’.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ హోవిట్జర్ గన్.. త్వరలో భారత్ సైన్యం అమ్ములపొదిలోకి చేరనుంది. జబల్పూర్ లోని గన్ క్యారేజీ ఫ్యాక్టరీ (జీసీఎఫ్)లో తయారైన ధనుష్, 45 కాలిబర్ 155 ఎంఎం తుపాకీ. ఏ ప్రాంతానికైనా సులువుగా తీసుకెళ్లగలగడం, శత్రు స్థావరాలపై నిప్పులు కురిపించడం దీని ప్రత్యేకత. ఈ ధనుష్ కు ‘దేశీయ బోఫోర్స్’ అనే ముద్దు పేరు కూడా ఉంది. పలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించారు. ఈ ఒక్కొక్క ధనుష్ తయారీకి రూ.14 కోట్లు వ్యయమైందని జీసీఎఫ్ జనరల్ ఎన్ కే సిన్హా వివరించారు. ఎలక్ట్రానిక్ విధానంలో లక్ష్యాలకు గురిపెట్టడం, శత్రువుల టెక్ వ్యవస్థలను గుర్తించడం తదితర సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఆయుధాన్ని నవంబర్ లోకెల్లా సైన్యానికి అందించనున్నట్టు స్పష్టం చేశారు. సాధారణ ఆయుధాలను బోఫోర్స్ గన్ తో పోలిస్తే.. అదనంగా 11 కిలోమీటర్ల దూరం వరకూ లక్ష్యాలను దీంతో ఛేదించవచ్చని తెలిపారు.

బోఫోర్స్ ఒప్పందంలో భాగంగా.. తొలి విడత భారత్ కు అందిన 12000 పేజిలకు పైగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, కోల్‌కతాకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఈ ధనుష్ తుపాకీని తయారుచేసింది. ఏదేమైనా.. ఈ ఆయుధంతో శత్రుసైన్యాన్ని తరిమితరిమి కొట్టవచ్చునని భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanush gun  indian army weapons  

Other Articles