భగత్ సింగ్.. ఓ స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. చిన్న పిల్లోడిని అడిగినా దీని మీద క్లారిటీగా మాట్లాడతారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం మామూలు జనాలకు అతీతం కదా అందుకే వివాదాలు మాట్లాడేందుకు ముందుంటారు. మీడియా కనబడితే చాలు ఊపులో ఏదో ఒకటి మాట్లాడటం మీడియాలో పెద్ద దుమారం రేగడం జరుగుతాయి. అయితే తాజాగా ఏ రాజకీయ నాయకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. భగత్ సింగ్ గురించి అతను చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఓ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెడదామన్న ప్రతిపాదనను తోసిపుచ్చుతూ భగత్ సింగ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చండీగఢ్ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించే సమయం దగ్గర పడుతున్నా.. విమానాశ్రయానికి పేరు ఖరారు చేయడంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరు ప్రభుత్వాలు విమర్శలు చేసుకుంటుండగా.. అమృత్‌సర్ అకాలీద్ అధ్యక్షుడు సిమ్రన్‌జిత్‌సింగ్ మన్ కొత్త వివాదానికి తెర తీశారు. విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, ఆయన ఓ ఉగ్రవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగత్‌సింగ్ స్వాతంత్య్ర సమరయోధుడు కాదు.. లేక జాతీయ హీరో కూడా కాదు. ఆయన ఓ టెర్రరిస్ట్. చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ ఏ ఆజం సర్దార్ భగత్‌సింగ్ ఎయిర్‌పోర్ట్ అని నామకరణం చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని పేర్కొన్నారు. పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ అమృత్‌సర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయడంలో విఫలమయ్యారని, ఆయన, వారి బంధువులు చండీగఢ్‌లో పెద్దఎత్తున భూములు కొన్నారని.. అందుకే పేరు విషయంలో మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సంజయ్‌టాండన్ మాత్రం విమానాశ్రయంపై పేరుపై ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more
May 20 | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. వరుస వివాదాలతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై... Read more