Chandrababu | Olympic Assosiation | Galla | CM Ramesh

Chandrababu naidu proposing new name for ap olympic assosiation president post

Chandrababu Naidu, AP Olympic Assosiation President, Galla Jayadev, Cm Ramesh

chandrababu Naidu proposing new name for ap olympic assosiation president post. Galla jayadev and Cm Ramesh competeing with their belngings.

కోతి న్యాయం చేసిన చంద్రబాబు నాయుడు

Posted: 09/08/2015 12:32 PM IST
Chandrababu naidu proposing new name for ap olympic assosiation president post

రెండు కోతులు కొబ్బరి ముక్క కోసం కొట్టుకుంటున్నాయట... అలా కొట్టుకుంటున్న కోతుల దగ్గరకు మూడో కోతి వచ్చింది. మీరు గొడవ పడకండీ అంటూ నేను న్యాయం చేస్తానని అనింది. తర్వాత ఓ తక్కెడ తీసుకువచ్చింది.. తర్వాత ఆ కొబ్బరిని రెండు ముక్కలుగా చేసి రెండు వైపులా ఉంచింది.. ఒక వైపు బరువు ఎక్కువై వంగడంతో.. ఇక్కడ బరువు ఎక్కవగా ఉంది కాబట్టి సమయం చెయ్యడానికి అంటూ కొంచెం కొబ్బర తినింది.. ఇలా మొత్తం కొబ్బర తినిందట. అచ్చంగా చంద్రబాబు నాయుడు కూడా మూడో కోతి న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇద్దరు అధికార ఎంపీలకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంలో సీఎం రమేష్, గల్లా జయదేవ్ లకు ఆయన షాకిచ్చారు. అధ్యక్ష రేసు నుంచి ఇరువురిని తప్పించి, మరో వ్యక్తిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో టీడీపీలో చెలరేగిన చిచ్చు.. చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీల మధ్య వివాదంగా మారిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ రచ్చకు ముగింపు పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన స్పోర్ట్స్ రివ్యూలో.. ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఎంపీలు.. సీఎం రమేష్, గల్లా జయదేవ్ లను ఏపీఓఏ నుంచి ఉపసంహరింపజేయాలని ప్రకటించారు. తర్వలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇరుపక్షాలను ఒప్పించాలని సమావేశంలో తెలిపారు.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం కూడా రెండుగా విడిపోయింది. ఏపీ ఒలంపిక్ సంఘానికి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఈ పదవి కోసం గల్లా జయదేవ్, సీఎం రమేష్ పోటీపడ్డారు. గత ఏప్రిల్ లో తిరుపతిలో ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశమై.. గల్లా జయదేవ్ ను అధ్యక్ష పదవికి ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని, తానూ.. అధ్యక్ష రేసులో ఉన్నానని సీఎం రమేష్ ప్రకటించారు. అనంతరం హైదరాబాద్ లో జరిగిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రెండు ఎన్నికలతో వివాదం తారస్థాయికి చేరింది. ఒలంపిక్ అధ్యక్ష రగడతో.. చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు భావించారు. ఇరువురికి ఇబ్బంది లేకుండా రేసు నుంచి ఉపసంహరింపజేయాలని నిర్ణయించారు. అధ్యక్ష పదవికి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని ఆదేశించారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదనే..ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఒలంపిక్ అధ్యక్ష రగడకు ఇక్కడితో తెరపడినట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP Olympic Assosiation President  Galla Jayadev  Cm Ramesh  

Other Articles