Jammu Kashmir Floods Changed Hilal Ahmed Life Story | Floods In India

Jammu kashmir floods hilal ahmed special story

jammu kashmir floods, hilal ahmad, floods hilal ahmad life story, jammu kashmir incident, jammu kashmir floods funds, hilal ahmad floods story

Jammu Kashmir Floods Hilal Ahmed Special Story : Jammu Kashmir Floods Changed Hilal Ahmed Life Story Who Lost His Wealth At That Time.

కొట్టుకుపోయిన ఆశయాలకు పందిరి వేసిన యువకుడు

Posted: 09/07/2015 11:41 AM IST
Jammu kashmir floods hilal ahmed special story

తలపెట్టిన కార్యాలు మధ్యలోనే ఆగిపోతే ప్రతిఒక్కరు తీవ్ర మనోవేదనకు గురవుతారు. అటువంటి ఘటనలు వారిని కలచివేయడమే కాకుండా వారి జీవితాల్లో అనుహ్య మార్పులు తెచ్చిపెడుతాయి. కొందరికి గాయాలుగా మిగిలితే.. మరికొందరికి మధుర జ్ఞాపకాలుగా వుండిపోతాయి. ‘ఎందుకిలా జరిగింది’ అంటూ జీవితాంతం ఆవేదన చెందేవాళ్లు కొందరుంటే.. మరికొందరికి జీవితంలో కోలుకోవాలన్న గుణపాఠాన్ని నేర్చుకుంటారు. కానీ.. వీరందరికీ భిన్నంగా ఇంకొంతమంది వుంటారు. తమ జీవితంలో ఎదరైన విషాదాల్ని పూర్తిగా మరిచిపోయి.. సంతోషకరమైన పనితో భర్తీ చేయొచ్చని భావిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా ఓ 25 ఏళ్ల యువకుడి గాధ నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సరిగ్గా ఏడాదిక్రితం.. అంటే సెప్టెంబర్ 7వ తేదీన జమ్మూకాశ్మీర్కు చెందిన హిలాల్ అహ్మద్ అనే 25 ఏళ్ల యువకుడి జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది. మరుసటి రోజు అతడి పెళ్లి జరగాల్సి వుండగా.. అనూహ్యంగా వరదలు వచ్చాయి. ఆ వరద బీభత్సం కారణంగా అతడి సర్వస్వం మొత్తం కొట్టుకుపోయింది. అతడి ఆశయాలు, ఆస్తులు అన్ని వరదల్లో చెల్లాచెదురయ్యాయి. దీంతో అతని పెళ్లి ఆగిపోయింది. ఆ విషాదం అతనిని భౌతికంగా దెబ్బతీయడమే కాకుండా మానసికంగా కలచివేసింది. తీవ్రంగా కుంగిపోయిన అతగాడు తన విషాదగాధను ఆనాడు మీడియాతో చెప్పుకున్నాడు. అయితే.. ఆ విషాదం అతని జీవితంలో సరికొత్త మలుపు తీసుకొచ్చింది. దానిని తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. ఆ ఘటనను సంతోషంగా మలుచుకుంటే జీవితం సుఖంగా గడిచిపోతుందని భావించాడు. తన ఆలోచన దిశగా అడుగులు వేసిన అతగాడు.. అందరికీ ఆశ్చర్యం కలిగేలా తన జీవితాన్ని మలుచుకున్నాడు.

ప్రస్తుతం హిలాల్ చెక్కతో నిర్మించిన రెండుగదుల ఇంట్లో వుండటమే కాక వివాహం కూడా చేసుకోబోతున్నాడు. శ్రీనగర్లోని చినార్బాగ్లో ఉంటున్నవారి కుటుంబం వారికి ఉన్నంతలోనే పెళ్లి పనుల్లో బిజీ అయ్యి కనిపించారు. ఈ సందర్భంగా వరదల గురించి చెబుతూ ‘నా జీవితంలోనే అలాంటి విధ్వంసం చూడలేదు. నేను సర్వస్వం కోల్పోయాను. ఎంతో కష్టపడి అదే ప్రదేశంలో చెక్కతో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. అన్ని వస్తువులు తెచ్చుకున్నాను. ఇక ఆ విషాదం మరిచిపోయేలా అదే అమ్మాయితో ఇప్పుడు నా వివాహం చేసుకుంటున్నాను’ అని చెప్పాడు. జీవితంతో పోరాడితే ఏదైనా సాధించగలమన్న సూక్తిని అతగాడు నిరూపించాడు. జీవితంలో ఏమీ సాధించలేమని ఓడిపోయే ప్రతిఒక్కరికి ఇతని జీవితగాధ ఆదర్శంగా నిలిచింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir floods  hilal ahmad floods story  

Other Articles