Andhra Pradesh Capital Amaravathi Have To Face Floods Problems In Future | CRDA Survey | AP Capital City

Andhra pradesh capital amaravathi floods problems crda survey

ap capital city, amaravathi master plan, ap capital city master plan, amaravathi floods problem, crda survey on amaravathi, crda survey news, amravathi latest updates, chandrababu naidu, andhra pradesh government, amaravathi funds

Andhra Pradesh Capital Amaravathi Floods Problems CRDA Survey : CRDA Given Clarification On AP Capital City That Amaravathi May Sink 25 Percent When Floods Will Come.

నవ్యాంధ్ర రాజధానికి ‘వరద’ ముప్పు

Posted: 09/07/2015 11:09 AM IST
Andhra pradesh capital amaravathi floods problems crda survey

ఎన్నో ఆశలతో రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతానికి కొత్త కష్టాలు ఎదురవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూసేకరణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వానికి.. భవిష్యత్తులో మరో రూపంలో కష్టాలు వచ్చిపడుతాయని సీఆర్డీయే వెల్లడిస్తోంది. అదేమిటంటే.. నూతన రాజధాని ప్రాంతంలో సేకరించిన భూమిలో.. 10 వేల ఎకరాల వరకూ తరచూ ముంపునకు గురవుతోందని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే) తేల్చి చెప్పింది.

ముఖ్యంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవుండగా, 7,300 క్యూసెక్కుల వరదనీరు అమరావతి మీదుగా ప్రవహిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ వరద కారణంగా 13,500 ఎకరాలు మునిగిపోగా.. అందులో 10,600 ఎకరాలు సమీకరించిన భూమిలో ఉందని వివరించింది. ఈ లెక్కప్రకారం.. మొత్తం అమరావతి పరిధిలో వరదొస్తే నాలుగో వంతుకు పైగా ప్రాంతం నీట మునుగుతుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో.. ఈ విషయమై వెంటనే కాంటూరు సర్వే చేయించాలని, వరద తీవ్రతను గుర్తించేందుకు నిపుణులైన హైడ్రాలజికల్ కన్సల్టెంట్ ను నియమించాలని సిఫార్సు చేసింది. అలాగే.. కృష్ణా వరదకట్టల అడుగున వున్న ఇసుక, పూడిక ఏ మేరకు ఉందో తేల్చాలని కోరింది.

ఇదిలావుండగా.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బ్యారేజీ వద్ద నీటి అడుగు భాగంలో సర్వే కోసం ఐఐటీ టెక్నాలజీస్ ను కన్సల్టెంట్ గా నియమించి, 1.53 కోట్లకు కాంట్రాక్టు అప్పగించింది. ఇప్పుడు కాంటూరు సర్వే కోసం మరెంత ఖర్చవుతుందోనని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital city updates  amaravathi floods problems  chandrababu naidu  

Other Articles