woman pulls her chain from chain snacher

Women grabed her mangalsutra from chain snacther

chain chain snatchers, saroornagar, mini tankbund, devamma, aarogya, chaitanyapuri police station limits, violence against women, crime against women, harrassment against women

A woman devamma pulled back her mangalsutra, after an attempt by two chain snatchers at saroornagar mini tankbund on Thursday evening.

చైన్ స్నాచర్లకు చుక్కులు చూపి.. మంగళసూత్రాన్ని కాపాడుకుంది..

Posted: 09/03/2015 10:58 PM IST
Women grabed her mangalsutra from chain snacther

రెండు తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న చైన్ స్నాచర్లకు కళ్లెం వేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట చైన్ దొంగలే తమ ప్రతాపాన్ని చాటుకుంటూ.. మహిళల కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నారు. అయితే బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి, తన చైన్‌ను లాక్కుని కాపాడుకుంది ఓ మహిళ. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలి కథనం ప్రకారం.. శారదానగర్‌లో నివసించే దేవమ్మ (43) ఇళ్లలో పనిచేస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం కూతురు ఆరోగ్యతో కలిసి సరూర్‌నగర్ కట్టపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకుల్లో ఒకడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగాడు. తెగిన గొలుసు అతని చేతుల్లో ఉండగానే వెంటనే దేవమ్మ తేరుకుంది. స్నాచర్‌ను గట్టిగా ప్రతిఘటించి తన గొలుసును తిరిగి లాగేసుకుంది. ఆపై ఆమె గట్టిగా కేకలు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chain snatchers  saroornagar  mini tankbund  devamma  

Other Articles